ఉచితంగా మ్యూజిక్ స్కూల్ పెట్టి మ్యూజిక్ నేర్పించాలని ఉంది: దేవిశ్రీ

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో, దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ఎఫ్ 3.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

 Music School For Free Is To Teach Music By Devisriprasad Devisreeprasad, Tollywo-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సినిమా ఈ నెల 27వ తేదీ విడుదలకు సిద్ధమైంది.ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవిశ్రీప్రసాద్ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తాను ఒక సినిమాకు సంగీత దర్శకత్వం వహించే ముందు ముందుగా ఆ సినిమా కథ మొత్తం అర్థం చేసుకొని తన నుంచి డైరెక్టర్ ఎలాంటి మ్యూజిక్ రావాలి అనుకుంటాడో తెలుసుకొని అదే శైలిలోని మ్యూజిక్ క్రియేట్ చేస్తానని దేవిశ్రీ వెల్లడించారు.

ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ అనిల్ రావిపూడి సినిమాలో స్వచ్ఛమైన హాస్యం పండించే కథ ఉంటుందని, ఒకప్పుడు జంధ్యాల ఈవీవీ వంటి వారి సినిమా శైలిలో అనిల్ రావిపూడి సినిమా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

Telugu Anil Ravipudi, Devisreeprasad, Music Direct, Music School, Tollywood, Var

ఇక ఎఫ్ 3 సినిమాలో ఏ పాట ప్రాధాన్యత ఆ పాటకు ఉందని, ఇప్పటికే విడుదలైన  ‘లబ్‌ డబ్‌ లబ్‌ డబ్‌ డబ్బు’, ‘ఊ ఆ ఆహా ఆహా‘, ‘లైఫ్‌ అంటే ఇట్లా ఉండాలా.’ అన్ని పాటలకు మంచి స్పందన వచ్చిందని ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించారు.సినిమాకి పడే కష్టం ఎలా ఉంటుందో తనకు తెలుసని అందుకే ప్రతి ఒక్క సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.

ఏ సినిమా విజయం సాధించిన తప్పకుండా తాను శుభాకాంక్షలు తెలియజేస్తానని దేవిశ్రీ వెల్లడించారు.తన నాన్న తరచు తనకు ఒక మాట చెప్పే వారు ఇతరులు విజయం సాధించినప్పుడు వారి విజయాన్ని అభినందించే వాడే గొప్పవాడు అంటూ చెప్పేవారనీ దేవిశ్రీ తెలిపారు.

ఇక హైదరాబాద్లో తనకు మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేసి అందరికీ ఉచితంగా మ్యూజిక్ నేర్పించాలని కోరిక ఉందని అయితే ఇది నెరవేరడానికి మరి కాస్త సమయం పడుతుందని ఈ సందర్భంగా దేవిశ్రీ తన గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube