అనూప్, DSP , థమన్ ఆరేళ్ళ క్రితం అలా.. ఇప్పుడు ఇలా

టైం అనేది ఎవరిని ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్పడం కష్టం.అనామకులను ఓవర్ నైట్ స్టార్స్ చేస్తుంది.

 Music Directors Anup Rubens Dsp Thaman Trio After 6 Years-TeluguStop.com

గొప్ప స్టార్స్ ను రాత్రికి రాత్రే రోడ్డు మీదకు తీసుకొస్తుంది.కాలం ఆడే గేమ్స్ చాలా బాగుంటాయి.

అలాగే ఒకప్పుడు మామూలు సంగీత దర్శకులుగా కొనసాగిన కొందరు.ఇప్పుడు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా మారిపోయారు.

దేవి శ్రీ ప్రసాద్, తమన్, అనూప్ రూబెన్స్. ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్స్.

సరికొత్త బాణీలతో ముందుకు సాగుతున్నారు.పలు సినిమాలకు అద్భుత సంగీతం అందించి మంచి స్వింగ్ లో కొనసాగుతున్నారు.ఈ ముగ్గురు సంగీతం అందించిన పలు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ డూపర్ హిట్ కొట్టాయి.ఆరేండ్ల క్రితం ఈ ముగ్గురు సంక్రాంతికి పోటీ పడ్డారు.

ప్రస్తుతం మళ్లీ పోటీ పడుతున్నారు.గతంలో మూడు వరుస రోజుల్లో వీరి సినిమాలు జనాలను అలరించాయి.ఈ సారి మాత్రం ఒకే రోజు వీరి సినిమాలు పోటీ పడుతున్నాయి.

2016లో దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన సినిమా నాన్న‌కు ప్రేమ‌తో. ఈ సినిమా జ‌న‌వ‌రి 13న రిలీజ్ అయ్యింది.

Telugu Anoop, Anup Rubens, Bangarraju, Devi Sri Prasad, Music Directors, Soggade

అటు 14న తమన్ ట్యూన్స్ అందించిన డిక్టేటర్ విడుదల అయ్యింది.జనవరి 15న అనూప్ సంగీతం అందించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా విడుదల అయ్యింది.ఈ సినిమాలన్నీ బాగానే ఆడాయి.

Telugu Anoop, Anup Rubens, Bangarraju, Devi Sri Prasad, Music Directors, Soggade

ఆరు సంవత్సరాల తర్వాత ఈ ముగ్గురు మళ్లీ పోటీపడుతున్నారు.అదీ సంక్రాంతి రోజునే జనాల ముందుకు వస్తున్నారు.వీరు సంగీతం అందించిన తాజా సినిమాలు రౌడీ బాయ్స్, సూప‌ర్ మ‌చ్చి, బంగార్రాజు. ఈ సినిమాలు ఒకే రోజు అంటే.జ‌న‌వ‌రి 14న విడుదల అవుతున్నాయి.దేవి శ్రీ ప్రసాద్.

రౌడీ బాయ్స్ కు సంగీతం అందించగా.త‌మ‌న్.

సూప‌ర్ మ‌చ్చి సినిమాకు బాణీలు కట్టాడు.అనూప్.

బంగార్రాజు సినిమాకు స్వరాలు అందించాడు.మొత్తంగా ఈ ముగ్గురిలో ఎవరి సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube