మహేష్ బాబు కారణంగా ఇండస్ట్రీ కి దూరం కానున్న సంగీత దర్శకుడు థమన్..!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో టాప్ 2 మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో థమన్( Thaman S ) పేరు లేకుండా మాత్రం ఉండదు.సరికొత్త ట్యూన్స్ తో ఆయన రీసెంట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఏలేస్తున్నాడు.

 Music Director Thaman Will Be Away From The Industry Because Of Mahesh Babu.,-TeluguStop.com

చేతినిండా సినిమాలతో ఊపిరి కూడా ఆడనంత బిజీ గా సమయాన్ని గడుపుతున్నాడు.అలాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కెరీర్ ఇప్పుడు రిస్క్ లో పడిందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.

థమన్ అందిస్తున్న సంగీతం అందరికీ ఇన్స్టంట్ గా నచ్చేస్తుంది.కానీ మనోడి ట్యూన్స్ ని పోలినట్టుగా మరో ట్యూన్స్ ఇతర బాషల నుండి కొట్టేసినట్టుగా థమన్ పై ఒక రేంజ్ లో ముద్ర పడిపోయింది.

రీసెంట్ గా ఆయన సంగీత దర్శకత్వం వహించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం( Guntur Kaaram )’ చిత్ర టీజర్ విడుదల అయ్యింది.ఈ టీజర్ కి బంపర్ రెస్పాన్స్ వచ్చింది కానీ, థమన్ అందించిన ట్యూన్స్ తన పాత సినిమాల నుండే కాపీ కొట్టినట్టుగా అందరికీ అర్థం అయిపోయింది.

Telugu Guntur Kaaram, Mahesh Babu, Pawan Kalyan, Thaman, Tollywood-Movie

అప్పటి నుండి సోషల్ మీడియా లో థమన్ పై ట్రోల్ల్స్ ఒక రేంజ్ లో రావడం ప్రారంభం అయ్యింది, ఆయన ఈ ట్రోల్స్ ధాటిని భరించలేక సోషల్ మీడియా ని వదిలి వెళ్ళిపోయాడు.అంతకు ముందు థమన్ సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉండేవాడు,ఈ విషయం ప్రతీ ఒక్కరికి తెలిసిందే.మరోపక్క దర్శక నిర్మాతల నుండి కూడా థమన్ పై ఒత్తిడి ఒక రేంజ్ లో పెరిగిపోయింది.కాపీ ట్యూన్స్ ఇవ్వొదంటూ ప్రాధేయపడుతున్నారు.కొంతమంది దర్శకులు అయితే థమన్ వైపు చూడకుండా తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ వైపు చూస్తున్నారు.ఈయన ఇప్పటికే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేసాడు.

పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )’అజ్ఞాతవాసి’ తో ప్రారంభమైన అనిరుద్ టాలీవుడ్ జర్నీ, నేడు జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర‘ వరకు చేరుకుంది.ఈ సినిమా తర్వాత కూడా అనిరుద్ కి టాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కినట్టు తెలుస్తుంది.

Telugu Guntur Kaaram, Mahesh Babu, Pawan Kalyan, Thaman, Tollywood-Movie

థమన్ ఇలాగే కాపీ ట్యూన్స్ ఇస్తూ ఉంటే దర్శక నిర్మాతలు ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేసి, అనిరుద్ ని తీసుకునే ఛాన్స్ ఉంది.ప్రస్తుతం థమన్ పవన్ కళ్యాణ్ తో ‘బ్రో ది అవతార్’, రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ ‘భగవత్ కేసరి’, మహేష్ బాబు ‘గుంటూరు కారం’,మళ్ళీ పవన్ కళ్యాణ్ తో #OG వంటి చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు.రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ ( Bro )మూవీ మోషన్ పోస్టర్ విడుదల అయ్యింది.ఈ మోషన్ పోస్టర్ లో థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ ట్యూన్ ని ఎక్కడా కూడా కాపీ కొట్టినట్టు అనిపించలేదు.అలాగే పవన్ కళ్యాణ్ #OG చిత్రం మేకింగ్ వీడియో కి కూడా అదిరిపోయే రేంజ్ థీమ్ మ్యూజిక్ ఇచ్చాడు, ఈ మ్యూజిక్ కూడా ఎక్కడా కాపీ కొట్టినట్టుగా అనిపించలేదు.

అంటే ఆయన ఇక నుండి జాగ్రత్త పడినట్టు అర్థం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube