నెటిజన్ పరువు తీసిన థమన్.. బుర్ర పెరగలేదంటూ..?

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వకీల్ సాబ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించిన సంగతి తెలిసిందే.గతంలో కాపీ ట్యూన్లు ఇచ్చాడంటూ థమన్ పై విమర్శలు వ్యక్తం కాగా వకీల్ సాబ్ సినిమాకు మాత్రం పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ థమన్ అద్భుతంగా ఇచ్చాడంటూ నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

 Music Director Thaman Strong Counter To Netizen , Music Director Thamna, Neti-TeluguStop.com

ఇప్పటికే వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న థమన్ కు వకీల్ సాబ్ సినిమా తరువాత సినిమా ఆఫర్లు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.

అయితే ఒక నెటిజన్ మాత్రం థమన్ హర్ట్ అయ్యేలా ట్వీట్ చేయగా థమన్ ట్విట్టర్ లో ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా వకీల్ సాబ్ ను ప్రశంసించిన సంగతి తెలిసిందే.మహేష్ వకీల్ సాబ్ మూవీని మెచ్చుకోవడంతో థమన్ ధన్యవాదాలు తెలిపారు.

అయితే థమన్ మహేష్ కు ధన్యవాదాలు చెప్పిన సమయంలో సర్కారు వారి పాట సినిమాను ట్యాగ్ చేయలేదు.

థమన్ సర్కారు వారి పాట మూవీని ట్యాగ్ చేయకపోవడంతో ఒక నెటిజన్ సర్కారు వారి పాటు హ్యాష్ ట్యాగ్ ను ట్యాగ్ చేస్తే మీ అమ్మ అన్నం పెట్టనన్నదా బ్రో? అని కామెంట్ చేశారు.ఆ కామెంట్ తో హర్ట్ అయిన థమన్ మా అమ్మగారు అన్నం పెట్టడం తరువాత సంగతి అని తాను తన అమ్మకు గత 27 సంవత్సరాలుగా అన్నం పెట్టడంతో పాటు కంటికి రెప్పలా చూసుకుంటున్నానని పేర్కొన్నారు.

మీ అమ్మగారికి మీకు బుర్ర పెరిగే విధంగా మంచి ఆహారం పెట్టమని చెప్పాలని థమన్ నెటిజన్ పై ఘాటుగా స్పందించారు.

వకీల్ సాబ్ తో హిట్ కొట్టిన థమన్ సర్కారు వారి పాట సినిమాకు సంగీతం అందిస్తున్నారు.వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube