కాపీ క్యాట్ ఆరోపణలపై సీరియస్ అయిన తమన్

టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే వంద సినిమాలకి పైగా సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకొని ప్రస్తుతం స్టార్ దర్శకుడుగా తిరుగులేని సక్సెస్ తో దూసుకుపోతున్న వ్యక్తి తమన్.అల వైకుంఠపురంలో సినిమాతో గత ఏడాది సోషల్ మీడియా సెన్సేషన్ గా తమన్ మారిపోయాడు.

 Music Director Thaman Serious On Copy Cat Comments, Tollywood, Telugu Cinema, Tr-TeluguStop.com

అతని పాటలు అన్ని కూడా దేశ వ్యాప్తంగా సంచలన విజయాలు అందుకున్నాయి.బుట్టబొమ్మ సాంగ్ అయితే మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ క్రింద మారిపోయింది.

రికార్డు స్థాయిలో వ్యూస్ ని ఈ సాంగ్ సొంతం చేసుకుంది.ఇప్పుడు క్రాక్ పాటలతో మరోసారి దుమ్ములేపుతున్నాడు.

ప్రస్తుతం తమన్ చేతిలో పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ తో పాటు స్టార్ హీరోలు, కుర్ర హీరోల సినిమాలు కలిపి ఒక అరడజను వరకు ఉన్నాయి.స్టార్ హీరోలు అందరూ కూడా తమన్ మ్యూజిక్ కోసం ఇంటరెస్ట్ చూపిస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో మాత్రం అతని పాటలపై ట్రోలర్స్ అదే పనిగా విమర్శలు చేస్తూ ఉంటారు.కాపీ ట్యూన్స్ తో సాంగ్స్ చేస్తూ ఉంటాడని ట్రోల్ చేస్తూ ఉంటారు.

Telugu Krack, Music Thaman, Telugu, Tollywood-Movie

ఫన్నీగా అతని పాటలని ఉపయోగించుకొని ట్రోల్ చేస్తూ ఎక్కువ మందిని ఆకర్షిస్తూ ఉంటారు.ఈ నేపధ్యంలో చాలా మంది ఆడియన్స్ కూడా తమన్ ట్యూన్స్ దొబ్బేస్తూ ఉంటాడనే అభిప్రాయానికి వచ్చేశారు.తాజాగా క్రాక్ సినిమాలో ఒక సాంగ్ విషయంలో ఇదే విధంగా ట్రోల్ చేస్తున్నారు.ఈ ట్రోల్స్ పై ఎప్పుడు కూడా అంత పెద్దగా సీరియస్ కానీ తమన్ మొదటి సారి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశాడు.

వాళ్లకి అంత దమ్ముంటే.వచ్చి కొత్తగా ఓ పాట క్రియేట్‌ చేసి చూపించమనండి అంటూ మండిపడ్డాడు.

ఎవడు పడితే వాడు వచ్చి కాపీ కొట్టాడంటే ఇక్కడ ఎవడూ వినేవాడు లేడు అంటూ ఫైర్ అయ్యాడు.ఓ పాట విడుదల చేసేముందు అంద‌రూ వింటారు.

ఆడియో కంపెనీలు, లిరిక్‌ రైటర్లు, తనతో పనిచేసే వాళ్లు అంతా వింటారు.మరి వాళ్లందరికీ నచ్చే పాట కాపీ అయితే వాళ్లకు తెలివి లేదంటారా అంటూ ప్రశ్నిస్తున్నాడు.

ఒకవేళ నిజంగా కాపీ కొడితే దర్శక నిర్మాతలకి తన ముఖం ఎలా చూపిస్తా అంటూ ఫైర్ అవుతున్నాడు.అంతంత రెమ్యునరేషన్ ఇచ్చే నిర్మాతలు నువ్వెందుకు కాపీ కొట్టావని అడుగుతారు కదా అంటున్నాడు.

తమన్ చెప్పే మాటల్లో కూడా వాస్తవం ఉంది.కాపీ అనే అభిప్రాయం ఉంటే నిర్మాతల నుంచి దర్శకులు, హీరోల వరకు అతనికి పిలిచి మరీ అవకాశాలు ఇవ్వరు కదా.అయినా ట్రోల్ చేస్తూ డబ్బులు సంపాదించేవారికి కావాల్సింది ఎవరో ఒకరి ఇమేజ్ డామేజ్ చేయడమే అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube