అబ్బే... అలాంటి వాటిని నేను పెద్దగా పట్టించుకోనంటున్న థమన్....

టాలీవుడ్ లో గుర్తింపు పొందిన సంగీత దర్శకుల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.

 Music Director Thaman React About Copy Rumors-TeluguStop.com

థమన్ ఒకరు.అయితే తెలుగులో దాదాపుగా అందరి స్టార్ హీరోల చిత్రాలకు సంగీతాన్ని అందించాడు థమన్.

ఇందులో ఇప్పటికీ కొన్ని పాటలు మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి.అయితే పాటల పరంగా ఎన్నో మంచి హిట్లు ఇచ్చినటువంటి ఎస్.ఎస్.థమన్ గత కొద్దికాలంగా కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

అయితే ఇంతకీ ఆ విమర్శలు ఏమిటంటే ఇటీవల కాలంలో థమన్ కంపోజ్ చేసినటువంటి “సామజవరగమన” అనే పాట ఎంతగా పాపులర్ అయ్యిందో మనందరికీ బాగా తెలుసు.అయితే ఈ పాటని కొంతమంది తెలంగాణ ఫోక్ సాంగ్ నీ చూసి థమన్ కాపీ కొట్టాడంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

అంతేగాక రాములో రాములా అనే పాటకి కూడా ఈ విధంగానే చేశాడంటూ కొందరు విమర్శిస్తున్నారు.

Telugu Music Thaman, Musicthaman, Ss Thaman Music, Thamanreact-Movie

అయితే తాజాగా ఈ విషయాలపై థమన్  స్పందించాడు.ఇందులో భాగంగా తాను ఎటువంటి పాటలని కాపీ కొట్టి ట్యూన్స్ చేయలేదని చెప్పుకొచ్చాడు.అంతేకాక తనకి ఎవరో పాటలని అవసరం కూడా లేదని కూడా తెలిపాడు.

అన్నిటికంటే ముఖ్యంగా తానెప్పుడూ ఒక పాటని కంపోజ్ చేయాలంటే భిన్నంగా ఆలోచిస్తానని అందువలన ఒక పాటకి మరో పాటకి చాలా వ్యత్యాసం ఉంటుందని తెలిపాడు.అలాగే నిజానిజాలు తెలియకుండా ఎవరో చేసేటటువంటి కామెంట్లను పట్టించుకోనని తెలిపాడు.

ఒకవేళ అలా పట్టించుకుంటూ పోతే జీవితం మొత్తం సమాధానాలు చెప్పడానికే సరిపోతుందని కాబట్టి సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉంటేనే మంచిదని అభిప్రాయపడ్డాడు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తమన్నా టాలీవుడ్ లో దాదాపుగా 8కి పైగా చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube