తెలుగు సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు.ప్రస్తుతం సౌత్ లో తమ హవా బాగానే నడుస్తుందని చెప్పవచ్చు ఒకవైపు తెలుగు మరొకవైపు తమిళం సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు.
తెలుగులో స్టార్ హీరోలు అయిన చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు,లాంటి హీరోలందరికీ తమన్ సంగీతాన్ని అందించారు.ఒక పది సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే అందులో తమన్ సంగీతం అందించిన ఆరు సినిమాలు ఉంటాయి.
కానీ తమన్ హీరో నాని నటించిన టక్ జగదీష్ సినిమా విషయంలో కాస్త బాధ పడ్డారట.తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హీరో నానికి నచ్చలేదట.
అందుకే మ్యూజిక్ ను గోపీసుందర్ తో చేయించుకున్నారట.తమన్ బాలీవుడ్ లో కూడా కొన్ని పాటలకు సంగీతాన్ని అందించాడు.
అయితే మన తెలుగు సినిమాలలో ఒక సినిమాకు ఒకే సంగీత దర్శకుడు ఉంటారు.కానీ బాలీవుడ్లో మాత్రం ఒక సినిమాకు ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులు ఉంటారు అని తెలిపారు.

బాలీవుడ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒకరు ఇస్తే, మరొకరు కంపోజ్ చేస్తారట .ఇక అక్కడ అలాంటివి చూడలేక తట్టుకోలేక పారిపోయి వచ్చాను.ఒక సినిమా మొత్తం మన చేతిలో పెడితే చేయగలం కానీ అలా పని చేయడం నావల్ల కాదు.అందుకే బాలీవుడ్ లో ఎక్కువ మ్యూజిక్ చేయలేదు అని తమన్ చెప్పాడు.
ఇక ప్రస్తుతం తమన్ భీమ్లా నాయక్ అఖండ, గాడ్ ఫాదర్ సర్కారు వారి పాట లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.