19 ఏళ్ల వయస్సులో 30 లక్షలు పోగొట్టాను.. శ్రీలేఖ షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన ఎం.ఎం శ్రీలేఖ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏ పాట అయినా ఇబ్బంది పడి పాడలేదని తెలిపారు.

 Music Director Srilekha Shocking Comments In An Interview , 30 Lakh Rupees, Shoc-TeluguStop.com

కంటేనే అమ్మ అనే పాట కోసం చాలా కష్టపడ్డానని శ్రీలేఖ వెల్లడించారు.పాట బాగుంటే బీ, సీ సెంటర్లలో సైతం క్లాస్ పాటలకు క్లాప్స్ పడతాయని శ్రీలేఖ చెప్పుకొచ్చారు.

కొన్నిసారు టైమ్ ఇవ్వకుండా సాంగ్స్ చేయమని చెబుతారని శ్రీలేఖ కామెంట్లు చేశారు.

సినిమా రిలీజ్ డేట్ ఇచ్చేశామని చెప్పి వేగంగా రీరికార్డింగ్ చేయమని చెబుతారని శ్రీలేఖ వెల్లడించారు.

ఎ.ఆర్.రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు మాత్రం ముందుగానే రీరికార్డింగ్ కు సమయం కావాలని చెబుతారని శ్రీలేఖ చెప్పుకొచ్చారు.జ్ఞానం తెలియకపోవడం వల్ల 30 లక్షల రూపాయలు పోగొట్టుకున్నానని మోసం చేయడం తప్పు కాదని మోసపోవడం తప్పు అని నాన్న చెప్పారని శ్రీలేఖ వెల్లడించారు.

కెరీర్ లో కష్టపడి సంపాదించిన 30 లక్షల డబ్బు పోయిందని ఇంకోసారి ఆ తప్పు జరగకుండా చూసుకోవాలని శ్రీలేఖ పేర్కొన్నారు.టాలెంట్ ఉంటే మళ్లీ డబ్బు వస్తుందని 30 లక్షల రూపాయలు పోగొట్టుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డానని శ్రీలేఖ పేర్కొన్నారు.తాను లెక్కల్లో కొంచెం వీక్ అని శ్రీలేఖ వెల్లడించారు.19, 20 సంవత్సరాలకు సంబంధించి అనుభవం కూడా ఉండదని శ్రీలేఖ పేర్కొన్నారు.

Telugu Rupees, Interview, Srilekha-Movie

పోయిన డబ్బుల గురించి తాను ఎక్కువగా ఆలోచించలేదని నెక్స్ ఏంటి.? అని ముందుకు వెళతానని నాన్నగారిని పోగొట్టుకోవడం అన్ని బాధలను మించిన బాధ అని అంతకు మించిన లోటు అయితే లేదని శ్రీలేఖ చెప్పుకొచ్చారు.నాన్నగారు ఉంటే ఆ ధైర్యమే వేరని శ్రీలేఖ తెలిపారు.శ్రీలేఖ 30 లక్షల రూపాయలు పోగొట్టుకున్నా ఆ బాధను మరిచిపోయి కెరీర్ విషయంలో ఎదగడం గమనార్హం.శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్ గా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube