గుండెపోటుతో హాస్పిటల్ లో చేరిన టాలీవుడ్ సంగీత దర్శకుడు  

Music Director Shashi Preetam Suffers Heart Attack Stable Now - Telugu Music Director Shashi Preetam Suffers Heart Attack, South Cinema, Stable Now, Telugu Cinema, Tollywood

ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో తరుచుగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఈ ఏడాదిలో బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు కన్నుమూసారు.

 Music Director Shashi Preetam Suffers Heart Attack Stable Now

అలాగే టాలీవుడ్ లో కూడా కొంత మంది ప్రమాదాల బారిన పడ్డారు.నటుడు శివాజీ కొద్ది నెలల క్రితం గుండెపోటుతో హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకొని బయట పడ్డారు.

తాజాగా టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది.ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ గుండెపోటుకు గురయ్యారు.

గుండెపోటుతో హాస్పిటల్ లో చేరిన టాలీవుడ్ సంగీత దర్శకుడు-Movie-Telugu Tollywood Photo Image

పలు సినిమాలతో పాటు, సీరియల్స్ కు ఆయన సంగీతం అందించారు.

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ గులాబీ చిత్రంతో ఆయన సినీ పరిశ్రమకు పరిచయం అయిన ఆయన తరువాత హిందీ చిత్రాలకు సైతం మ్యూజిక్ అందించారు.

గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ఆయనను పరీక్షించిన వైద్యులు స్టెంట్స్ వేశారు.ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు.ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

మరోవైపు, శశి ప్రీతమ్ గుండెపోటుకు గురయ్యారనే వార్తతో టాలీవుడ్ ఉలిక్కి పడింది.ఆయన త్వరగా కోలుకోవాలని సినీరంగంలోని వ్యక్తులు ఆకాంక్షిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test