పాటలక్క టీఆర్పీ పెంచేందుకు కదిలి వచ్చిన స్టార్.. ఎవరంటే?

సాధారణంగా బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో సినీ తారలు సందడి చేయడం కొత్తేమి కాదు.అయితే ఈ సంస్కృతి తెలుగులో కన్నా హిందీ సీరియల్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది.

 Music Director Rp Patnaik In Kriushna Tulasi Serial To Increase Trp Ratings-TeluguStop.com

ఈ విధంగా బుల్లితెరపై వెండితెర తారలు సందడి చేయడంతో ఆ సీరియల్ కి హైప్ క్రియేట్ కావడమే కాకుండా.వారికి కూడా పబ్లిసిటీ వస్తుంది.

ఈ క్రమంలోనే చాలామంది వెండితెర తారలు బుల్లితెరపై తళుక్కుమంటున్నారు.

 Music Director Rp Patnaik In Kriushna Tulasi Serial To Increase Trp Ratings-పాటలక్క టీఆర్పీ పెంచేందుకు కదిలి వచ్చిన స్టార్.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం హిందీ సీరియల్స్లో ఎక్కువగా చోటు చేసుకుంటున్న ఇలాంటి గెస్ట్ అప్పియరెన్స్ లు తెలుగులో కూడా ఇదే పద్ధతిని అనుసరించబోతున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే జీ తెలుగులో ప్రసారమయ్యే “కృష్ణ తులసి” సీరియల్ లో సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ సందడి చేయబోతున్నారు.తాజాగా పాటలక్క కోసం ఆర్ పి పట్నాయక్ రంగంలోకి దిగబోతున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఆర్.పి పట్నాయక్ కనిపించబోయే సన్నివేశంతో కూడిన ప్రోమోను జీ తెలుగు విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్ల నుంచి విశేష స్పందన దక్కించుకుంది.ఇదిలా ఉండగా గత రెండు రోజుల క్రితం బుల్లితెరలో సరికొత్తగా ప్రసారం కాబోతున్న “ముత్యమంతా ముద్దు” అనే సీరియల్ కోసం ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ విధంగా బుల్లితెరపై గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం వల్ల వారికి పబ్లిసిటీ రావడమే కాకుండా… సీరియల్ కి కూడా బాగా రేటింగ్స్ పెరుగుతాయని చెప్పవచ్చు.

#Trp #RP Patnaik #Krishna Tholasi #Krithi Shetty #Trp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు