”OG” నుండి అప్పుడే మరో అప్డేట్.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?

”OG”.ఈ సినిమా ఎవరిదీ అని ఆలోచిస్తున్నారా.? పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అయితే ఈ సినిమా గురించి పరిచయం చేయాల్సిన పని లేదు.ఎందుకంటే ఆయన సినిమాల అప్డేట్ ల గురించి ఎప్పుడు అలెర్ట్ గానే ఉంటారు.

 Music Director Revealed In Pawan Kalyan Sujeeths Film-TeluguStop.com

మరి ‘‘OG” అంటే పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా.ఈ సినిమాను ప్రజెంట్ ఈ పేరుతోనే పిలుచు కుంటున్నారు.

పవర్ స్టార్ కెరీర్ లోనే ఎప్పుడు లేని విధంగా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్న విషయం తెలిసిందే.క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు పూర్తి కాకుండానే పవన్ కళ్యాణ్ మరిన్ని సినిమాలను అధికారికంగా ప్రకటించాడు.

మరి పవన్ ప్రకటించిన సినిమాల్లో సాహో డైరెక్టర్ సుజీత్ కూడా ఉన్నాడు.సుజీత్ ప్రభాస్ తో సాహో సినిమా తీసిన విషయం తెలిసిందే.

ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ ఈ యంగ్ టాలెంట్ కు పవర్ స్టార్ అవకాశం ఇచ్చాడు.ఈ సినిమా ఇప్పట్లో స్టార్ట్ కాదు అని అంతా అనుకున్నారు.ఎందుకంటే వీరమల్లు సినిమా తర్వాత లైన్లో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉంది.

ఈ సినిమానే పవన్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు అని ఫ్యాన్స్ సైతం అనుకున్నారు.

కానీ హరీష్ కు షాక్ ఇచ్చి పవన్ కళ్యాణ్ సుజీత్ సినిమాను స్టార్ట్ చేసాడు.హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో మేకర్స్ ఈ సినిమాను ఈ రోజు స్టార్ట్ చేసారు.డివివి దానయ్య తన హోమ్ బ్యానర్ డివివి ఎంటర్టైన్ మెంట్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి అప్పుడే ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.ఈ విషయాన్నీ ఈయన సోషల్ మీడియాలో స్వయంగా చెబుతూ.”మేము OG తో స్టార్ట్ చేస్తాం” అంటూ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను షేర్ చేసారు.దీంతో ఈ సినిమా అతి త్వరలోనే స్టార్ట్ అయ్యేలా కనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube