తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించు కున్నారు.ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఏపి మంత్రులు నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, సింగర్ కోటి,
ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామిలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.
దర్శనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టువస్తంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.