మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు హీరోగా సినిమా.. చిరు హీరోయిన్ కూతురు ఎంట్రీ?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోల వారసులు హీరోలుగా డైరెక్టర్ ల వారసులు డైరెక్టర్లుగా, సంగీత దర్శకుల పిల్లలు సంగీత దర్శకులుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తున్నాము.అయితే కొన్నిసార్లు డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్ ల పిల్లలు కూడా హీరోలుగా వెండితెర అరంగ్రేటం చేస్తున్నారు.

 Music Director Koti Son Rajeev Saluri Movie Production No 1 Shooting Second Sche-TeluguStop.com

అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కోటి తన కొడుకును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు.

అదే విధంగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వాణి విశ్వనాథ్ కుమార్తె హీరోయిన్ గా ఈ చిత్రంతో ఎంట్రీ ఇవ్వనుంది.

ఇలా సంగీత దర్శకుడు కుమారుడు రాజీవ్ సాలూరి హీరోగా, హీరోయిన్ వాణి విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్ జంటగా కిట్టు నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్రొడక్షన్ నెంబర్ 1‘ చిత్రం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.

Telugu Heronevarsha, Koti, Musickoti, Rajivsaluri, Schedule Vizag, Tollywood, Va

టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై గాజుల వీరేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంమొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకోగా రెండవ షెడ్యూల్ తాజాగా వైజాగ్ లో ప్రారంభమైంది.ఈ సినిమాలో సంగీత దర్శకుడు కోటి ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.

సదన్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ వంటి వారు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube