కొత్త అవతారం ఎత్తిన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్  

Music Director Koti As Police Officer Role In Devineni Movie - Telugu Koti Act In Police Officer In One Movie, Music Director Koti, , Saluri Rajeswar Reddy

సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు కోటి.సాలూరి రాజేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కోటి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు మ్యూజిక్ లో.20 ఏళ్లు సంగీత దర్శకుడిగా తన ట్యూన్స్ తో శ్రోతలను మెస్మరైజ్ చేసిన కోటి ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారు.అదే ఒక చిత్రంలో పోలీస్ అవతారం లో ఆయన నటుడిగా మారారు.

Music Director Koti As Police Officer Role In Devineni Movie

నర్రా శివనాగేశ్వర రావు దర్శకత్వం లో నందమూరి తారక రత్న కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘దేవినేని’.ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రు జీవిత కధ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో కోటి ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.ఆయనకు సంబందించిన లుక్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.1983 లో విజయవాడ ఫస్ట్ సూపరింటెండెంట్‌ ఆఫ్ పోలీస్ కేఎస్‌ వ్యాస్ పాత్రను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పోషిస్తున్నారు.ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి అయింది.

కొత్త అవతారం ఎత్తిన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్-Movie-Telugu Tollywood Photo Image

మరో షెడ్యూల్‌ తో టాకీ పార్ట్ పూర్తవుతుంది.ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.

‘నా కెరీర్ లో ఇది రెండో దశ.సంగీత దర్శకుడిగా దాదాపు 20 సంవత్సరాలు రాణించాను.

ఇప్పుడు ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మీ ముందుకు రాబోతున్నాను.శివనాగు వచ్చి మీరు ఈ క్యారెక్టర్ చేయాలి అనగానే నా చిన్నప్పుడు మా నాన్న నన్ను పెద్ద ఐపీఎస్‌ ఆఫీసర్‌గా చూడాలనుకున్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే ఒప్పుకొన్నాను అని తెలిపారు.

ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Music Director Koti As Police Officer Role In Devineni Movie-music Director Koti,saluri Rajeswar Reddy Related....