అరుదైన వ్యాధితో బాధ పడుతున్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి!  

music director keeravani suffering with rare disease, MM Keervani, Rajamouli, RRR, Multipule Serolasis, Ramcharan, NTR, Music, Yoga - Telugu Mm Keervani, Multipule Serolasis, Music, Ntr, Rajamouli, Ramcharan, Rrr, Yoga

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో కీరవాణి ఒకరు.కీరవాణి ముందూవెనుక చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఎంట్రీ ఇచ్చి అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి కనుమరుగవుతున్నా ఆయన మాత్రం సంగీతంతో మెప్పిస్తూనే ఉన్నారు.

TeluguStop.com - Music Director Keeravani Suffering With Rare Disease

కుర్ర మ్యూజిక్ డైరెక్టర్లకు సైతం పోటీనిస్తూ ప్రత్యేకతను చాటుకుంటూ ఉన్నారు.మూడు దశాబ్దాల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.

కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడి వార్తల్లో నిలిచిన కీరవాణి కోలుకున్న తరువాత రెండుసార్లు ఆయన కుమారునితో కలిసి ప్లాస్మాదానం చేశారు.అయితే ఆయన ఒక అరుదైన వ్యాధితో బాధ పడుతున్నారు.

TeluguStop.com - అరుదైన వ్యాధితో బాధ పడుతున్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

స్వయంగా ఆయనే నేడు ట్విట్టర్ లో వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.మల్టిపుల్ సెరోలిసిస్ అనే వ్యాధితో తాను బాధ పడుతున్నానని కీరవాణి తెలిపారు.

ఈ వ్యాధి వయస్సుతో సంబంధం లేకుండా ఎవరికైనా వస్తుందని పేర్కొన్నారు.

శరీరానికి, మెదడుకు మధ్య అనుసంధానాన్ని మల్టిపుల్ సెరోలిసిస్ దెబ్బ తీస్తుందని అన్నారు.ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి సంగీతం, యోగా మార్గమని ఆయన పేర్కొన్నారు.“ఎం.ఎస్ ఇండియా” అనే సంస్థ ప్రజలకు ఈ వ్యాధి గురించి అవగాహన కల్పిస్తోందని వెల్లడించారు.ఎవరైనా తమ సన్నిహితులు ఇలాంటి వ్యాధితో బాధ పడుతున్నారని తేలితే సహాయసహకారాలు అందించాలని పేర్కొన్నారు.

ప్రస్తుతం కీరవాణి ఆర్ఆర్ఆర్‌ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నారు.ఆర్ఆర్ఆర్‌ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో.? అని కంగారు పడుతున్న తారక్, చరణ్ ఫ్యాన్స్ కు త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుందని కీరవాణి వెల్లడించారు.ప్రీ ఇండిపెండెన్స్ పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించనున్నారు.2021 దసరా పండుగకు ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

#Music #MM Keervani #Ramcharan #Rajamouli #Yoga

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Music Director Keeravani Suffering With Rare Disease Related Telugu News,Photos/Pics,Images..