కీరవాణికి రాజమౌళి అంటే గౌరవం లేదా?     2018-03-04   23:04:28  IST  Raghu V

కీరవాణికి – రాజమౌళి కలిసి చాల సినిమాలే చేసారు, చేస్తున్నారు. అయినా ఆయనకీ రాజమౌళి అంటే, గౌరవం లేదట. ఇది నిజమేనా..వివరాలోక్కి వెళ్తే, కీరవాణి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దేవుడిపట్ల మీ అభిప్రాయం చెప్పండని అడిగితే, తనకు దేవుడంటే నమ్మకం ఉందని,మనల్ని మించిన ఒక శక్తి పేరే దేవుడని తను నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చాడు ఈ సంగీత దర్శకుడు. అయితే దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళని, దేవుడు ఉన్నాడో లేడో అని మధ్యస్తంగా ఉండేవాళ్ళను కూడా తను గౌరవిస్తానంటూ అన్నాడు. కాని దేవుడే లేడు అనే నాస్తికుల పట్ల తనకు ఎటువంటి గౌరవం లేదని తేల్చి చెప్పేసాడు.

ఇక్కడ విషయమేంటంటే, రాజమౌళి ఎన్నో సార్లు తను నాస్తికుడిని అంటూ పలు ఇంటర్వ్యూ లో చెప్పడం మనందరకి తెలిసిన విషయమే. తనకి దేవుడిపై నమ్మకం లేదని , తాను నాస్తికుడినని ప్రకటించాడు. కాని నాస్తికుడని ప్రకటించుకున్నాకా కూడా, రాజమౌళి చాల సార్లు గుడికి వెళ్ళడం జరిగింది. ఇలా గుడికి వెళ్ళడం పై బాబు గోగినేని లాంటి హేతువాదులు తమ తీవ్ర నిరసనని తెలిపారు. నిజంగా రాజమౌళి మనసేంటన్నది వారి కుటుం సభ్యులకే తెలియాలి.

ఇప్పుడు మరి రాజమౌళి కి దేవుడంటే నమ్మకం లేదు.. ఈ నేపధ్యంలో కీరవాణికి రాజమౌళి అంటే గౌరవం లేదనేగా? వీరిద్దరూ కలిసినపుడు వీరి మధ్య ఈ విషయంలో ఎలాంటి చర్చలు జరుగుతాయో అంటూ ఇప్పుడు సోషల్ మీడియా లో రూమర్ నడుస్తుంది.