ఈయన వెంట నిర్మాతలు

సక్సెస్‌ వెంట పరుగులు తీసేందుకు సినిమా ఇండస్ట్రీ వారు ఎప్పుడు కూడా ముందు ఉంటారు అనే విషయం తెల్సిందే.

ఏ హీరోకు అయినా, ఏ దర్శకుడికి అయినా సక్సెస్‌ వస్తే వారి వెంట నిర్మాతలు క్యూలు కట్టడం మనం చూస్తూనే ఉంటాం.

తాజాగా ప్రముఖ మలయాళీ సంగీత దర్శకుడు గోపీసుందర్‌ వెంట టాలీవుడ్‌ నిర్మాతలు పడుతున్నారు.మలయాళంలో ఎన్నో హిట్‌ సినిమాలను ఇచ్చి నేషనల్‌ అవార్డును సైతం సొంతం చేసుకున్న గోపీసుందర్‌ తెలుగులో మొదటి సినిమాగా ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే.

మొదటి సినిమాతోనే సూపర్‌ డూపర్‌ హిట్‌ను కొట్టిన గోపీసుందర్‌ వైపు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఆసక్తిగా చూస్తున్నారు.తక్కువ సమయంలో మంచి సంగీతాన్ని ఇవ్వడంలో గోపీ సుందర్‌ సిద్ద హస్తుడు అంటూ పేరు ఉంది.

దాంతో ఈయనతో తమ సినిమాలకు సంగీతం చేయించుకునేందుకు దర్శకులు మరియు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.ఇప్పటికే తెలుగులో రెండు సినిమాలకు గోపీ సుందర్‌ కమిట్‌ అయినట్లుగా తెలుస్తోంది.

Advertisement

భవిష్యత్తులో తెలుగులో స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఈయన మారడం ఖాయం అని అంటున్నారు.

న్యూస్ రౌండప్ టాప్ 20 
Advertisement

తాజా వార్తలు