ఈయన వెంట నిర్మాతలు

సక్సెస్‌ వెంట పరుగులు తీసేందుకు సినిమా ఇండస్ట్రీ వారు ఎప్పుడు కూడా ముందు ఉంటారు అనే విషయం తెల్సిందే.ఏ హీరోకు అయినా, ఏ దర్శకుడికి అయినా సక్సెస్‌ వస్తే వారి వెంట నిర్మాతలు క్యూలు కట్టడం మనం చూస్తూనే ఉంటాం.

 Music Director Gopi Sunder Getting Offers With Bbm Success-TeluguStop.com

తాజాగా ప్రముఖ మలయాళీ సంగీత దర్శకుడు గోపీసుందర్‌ వెంట టాలీవుడ్‌ నిర్మాతలు పడుతున్నారు.మలయాళంలో ఎన్నో హిట్‌ సినిమాలను ఇచ్చి నేషనల్‌ అవార్డును సైతం సొంతం చేసుకున్న గోపీసుందర్‌ తెలుగులో మొదటి సినిమాగా ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే.

మొదటి సినిమాతోనే సూపర్‌ డూపర్‌ హిట్‌ను కొట్టిన గోపీసుందర్‌ వైపు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఆసక్తిగా చూస్తున్నారు.తక్కువ సమయంలో మంచి సంగీతాన్ని ఇవ్వడంలో గోపీ సుందర్‌ సిద్ద హస్తుడు అంటూ పేరు ఉంది.

దాంతో ఈయనతో తమ సినిమాలకు సంగీతం చేయించుకునేందుకు దర్శకులు మరియు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.ఇప్పటికే తెలుగులో రెండు సినిమాలకు గోపీ సుందర్‌ కమిట్‌ అయినట్లుగా తెలుస్తోంది.

భవిష్యత్తులో తెలుగులో స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఈయన మారడం ఖాయం అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube