సూపర్‌ హిట్‌ సినిమాకు వివాదం.. రాజీకి వచ్చారట  

Music Director Gopi Sunder Facing Problems With Majili-

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మజిలీ’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. నాగచైతన్య మరియు సమంత జంటగా నటించిన ఈ చిత్రంకు శివ నిర్వాన దర్శకత్వం వహించాడు. రికార్డు స్థాయిలో ఈ చిత్రం వసూళ్లను రాబట్టింది. నాగచైతన్య కెరీర్‌లోనే మొదటి సారి ఇంత భారీగా వసూళ్లను రాబడుతున్న నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్‌ మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా హ్యాపీగా ఉన్నారు..

సూపర్‌ హిట్‌ సినిమాకు వివాదం.. రాజీకి వచ్చారట-Music Director Gopi Sunder Facing Problems With Majili

అయితే ఈ చిత్రం విడుదలై సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో ఇప్పుడు వివాదం మొదలు అవ్వడం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

సినిమా విడుదలకు ముందు ఈ చిత్రంలోని అనూహ్యంగా థమన్‌ ఎంట్రీ ఇచ్చాడు. గోపీసుందర్‌తో ఈ చిత్రంకు సంగీతం చేయించేందుకు ఒప్పందం చేసుకున్నారు.

అయితే గోపీసుందర్‌ పాటలు ఇచ్చాడు. అయితే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌కు టైం కావాలి, సినిమాను ఆలస్యం చేయమని దర్శకుడు శివ నిర్వానకు సూచించడం జరిగింది. అయితే సినిమా విడుదల ఆపడం ఇష్టం లేని దర్శకుడు వెంటనే తమన్‌ వద్దకు వెళ్లడం థమన్‌కు భారీ పారితోషికం ఇచ్చి మరీ చేయడం జరిగింది.

సినిమా విడుదలకు ముందు ఈ విషయాన్ని వివాదం చేయడం ఇష్టం లేని నిర్మాతలు విడుదలైన తర్వాత సంగీత దర్శకుడిపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్తి పారితోషికం తీసుకుని బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇవ్వనందుకు గోపీ సుందర్‌పై చర్యలు తీసుకోవాలని నిర్మాతల మండలిని నిర్మాతలు కోరడం జరిగింది. మండలి పెద్దల చర్చల నేపథ్యంలో సంగీత దర్శకుడు గోపీ సుందర్‌ నేపథ్య సంగీతం ఇవ్వని కారణంగా తన పారితోషికంలో కొద్ది మొత్తంను తిరిగి వెనక్కు ఇచ్చేందుకు ఓకే చెప్పాడట. తెలుగు, మలయాళంలో స్టార్‌ సంగీత దర్శకుడిగా దూసుకు పోతున్న గోపీ సుందర్‌పై ఇలాంటి విమర్శలు రావడం కాస్త ఇబ్బందికర విషయమే.