గోపీసుందర్ పక్కన ఉన్న ఈ యువతి ఎవరో మీకు తెలిస్తే షాకవ్వాల్సిందే?

Music Director Gopi Sundar And Singer Abhaya Hiranmayi Pic Goes Viral

మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కు తెలుగులో ఉన్న పాపులారిటీ అంతాఇంతా కాదు.గోపీసుందర్ మ్యూజిక్ అందించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

 Music Director Gopi Sundar And Singer Abhaya Hiranmayi Pic Goes Viral-TeluguStop.com

యువతను ఆకట్టుకునే విధంగా సినిమాలకు సంగీతం ఇవ్వడం గోపీసుందర్ ప్రత్యేకత అని చెప్పవచ్చు.మలయాళంతో పోలిస్తే ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు తెలుగులోనే ఎక్కువ మార్కెట్ ఉండటం గమనార్హం.

టాలీవుడ్ యంగ్, మిడిల్ రేంజ్ హీరోలకు గోపీసుందర్ ఎన్నో మ్యూజికల్ హిట్లు ఇచ్చారు.తాజాగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు కూడా గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్టర్ అనే విషయం తెలిసిందే.

 Music Director Gopi Sundar And Singer Abhaya Hiranmayi Pic Goes Viral-గోపీసుందర్ పక్కన ఉన్న ఈ యువతి ఎవరో మీకు తెలిస్తే షాకవ్వాల్సిందే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ మీట్ లో గోపీసుందర్ పక్కన ఒక యువతి కూర్చోగా ఆ యువతి ఎవరనే చర్చ జోరుగా జరుగుతోంది.గోపీసుందర్ పక్కన స్కర్ట్ లో ఒక లేడీ మెరిసిపోతూ అందరినీ ఆకట్టుకున్నారు.

గోపీసుందర్ పక్కన ఉన్న ఉన్న ఈమె పేరు అభయ హిరన్మయి కాగా ఈమె మలయాళంలో పాపులర్ సింగర్ కావడం గమనార్హం.తన గాత్రం ద్వారా మాత్రమే కాకుండా గ్లామరస్ గా కూడా కనిపిస్తూ అభయ హిరన్మయి పాపులారిటీని అంతకంతకూ పెంచుకున్నారు.

గోపీసుందర్ గతంలో ప్రియ అనే యువతిని వివాహం చేసుకోగా ఈ జంటకు మాధవ్, యాదవ్ పేర్లతో ఇద్దరు కొడుకులు ఉన్నారు.

Telugu Gopi Sunder, Interesting Facts, Musical Hits, Sninger Abhaya-Movie

అయితే కొన్ని కారణాల వల్ల ప్రియ, గోపీసుందర్ విడిపోయారు.ఆ తర్వాత గోపీసుందర్ అభయ హిరన్మయితో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు వెల్లడించారు.2018 సంవత్సరంలో అభయతో రిలేషన్ షిప్ లో ఉన్నానని గోపీసుందర్ అధికారిక ప్రకటన చేశారు.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ మీట్ లో అభయతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “మై పవర్ బ్యాంక్” అంటూ ఆమె గురించి చెప్పుకొచ్చారు.

#Musical Hits #Sninger Abhaya #Gopi Sunder

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube