హీరోలకు ఈక్వల్ రెమ్యునరేషన్ తో డీఎస్పీ..!

టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో సినిమాకు అదిరిపోయే క్రేజ్ తెస్తాడు.రిలీజ్ ముందే సినిమా పై బజ్ ఏర్పడేలా తన మ్యూజిక్ అందిస్తుంటాడు.

 Music Director Devi Sri Prasad Remuneration Shock , Devi Sri Prasad, Dsp, Dsp Re-TeluguStop.com

ఈ క్రమంలో దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే సినిమా ఆల్మోస్ట్ హిట్ అన్నట్టే లెక్క.హీరో ఎవరైనా.

డైరక్టర్ ఎవరైనా.కథ ఏదైనా.

బడ్జెట్ ఎంతైనా దేవి మ్యూజిక్ దుమ్ముదులపాల్సిందే.దేవి సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమా వరకు తన మ్యూజిక్ తో అదరగొడుతున్నాడు దేవి శ్రీ ప్రసాద్.

స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అయిన డీఎస్పీ సినిమాకు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటాడని టాక్.

మొన్నటిదాకా 3 కోట్ల దాకా ఒక సినిమాకు పారితోషికం అందుకున్న దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని తెలుస్తుంది.5 కోట్లు అంటే దాదాపు మీడియం రేంజ్ హీరోలకు ఈక్వల్ గా దేవి శ్రీ ప్రసాద్ రెమ్యునరేషన్ ఉందని చెప్పొచ్చు.ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ 5 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

పుష్పతో నేషనల్ వైడ్ గా మ్యూజిక్ పరంగా హాట్ టాపిక్ అయిన దేవి శ్రీ ప్రసాద్ హిందీ అవకాశాలు కూడా అందుకుంటున్నాడని టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube