రాధే శ్యామ్ కి సంగీత దర్శకుడుగా జస్టిన్ ప్రభాకరన్... ఊహించని ట్విస్ట్

డార్లింగ్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ లవ్ డ్రామా చిత్రం రాధేశ్యామ్.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రభాస్ చాలా ఇష్టపడి చేస్తున్నాడు.

 Music Director Confirmed For Radhe Shyam, Tollywood, Kollywood, Pan India Movie,-TeluguStop.com

ప్రభాస్ కెరియర్ లో చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న లవ్ స్టోరీ చిత్రం ఇదే కావడం విశేషం.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతుంది.

లాక్ డౌన్ ముగిసిన తర్వాత రీసెంట్ గా మరల ఇటలీ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని అక్కడ మొదలు పెట్టారు.పారిస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ తెరకెక్కుతోందని తెలుస్తుంది.

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.ఇదిలా ఉంటే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాధేశ్యామ్ నుంచి ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సినిమా మీద హైప్ క్రియేట్ చేయడం కోసం ఈ మధ్యకాలంలో చిత్ర యూనిట్ ఒకదాని తర్వాత ఒకటిగా అప్డేట్స్ ఇస్తూ వస్తుంది.

ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో క్లారిటీ ఇచ్చింది.

రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అంటే కచ్చితంగా ఎస్టాబ్లిష్ మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకుంటారని ఎవరైనా అనుకుంటారు.అయితే ఊహించని విధంగా చిత్ర యూనిట్ ఓ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చింది.

ఇప్పుడిప్పుడే తన మ్యూజిక్ తో అందరిని ఆకట్టుకుంటున్న యంగ్ టాలెంట్ ని దర్శకుడు రాధాకృష్ణ గట్టిగా నమ్మాడు.ఈ నేపధ్యంలో తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ ని సంగీత దర్శకుడుగా ఫైనల్ చేశారు.

డియర్ కామ్రేడ్ సినిమాతో ఈ మ్యూజిక్ దర్శకుడు తెలుగు ప్రేక్షకులకి ఇప్పటికే పరిచయం అయ్యాడు.అయితే తన మ్యూజిక్ తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ప్రభాకరన్ టాలెంట్ మీద చిత్ర యూనిట్ నమ్మకంగా ఉండటం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube