అఖిల్ ఏజెంట్ మ్యూజిక్ డైరక్టర్ చేంజ్..!

అక్కినేని అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న బ్యాచిలర్ సినిమా ఎట్టకేలకు అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరక్షన్ లో అఖిల్ సినిమా చేస్తున్నాడు.

 Music Director Change For Akhil Agent Movie,latest Tollywood News-TeluguStop.com

ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు.స్పై థ్రిల్లర్ గా రాబోతున్న అఖిల్ ఏజెంట్ సినిమాకు ముందు మ్యూజిక్ డైరక్టర్ గా థమన్ ను అనుకున్నారు.

కాని వరుస క్రేజీ సినిమాలతో బిజీగా ఉన్న థమన్ ఏజెంట్ సినిమాకు టైం కేటాయించే పరిస్థితి కనబడటం లేదట.అందుకే ఏజెంట్ సినిమాకు మరో థమన్ ప్లేస్ లో హిప్ హాప్ తమిళ మ్యూజిక్ ఫిక్స్ చేశారు.

Telugu Music, Ak, Akhil, Hiphop Tamiza, Pooja Hegde, Sakshi Vaidya, Thaman, Toll

ఏజెంట్ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.అఖిల్ ఫుల్ లెంగ్త్ మాస్ మూవీగా చేస్తున్న ఏజెంట్ సినిమా సురేందర్ రెడ్డి మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది.బ్యాచిలర్ సినిమాతో రొమాంటిక్ హిట్ అందుకునే అవకాశం ఉండగా ఏజెంట్ సినిమాతో అఖిల్ మాస్ హీరోగా క్రేజ్ తెచ్చుకుంటాడని చెబుతున్నారు.సైరా తర్వాత సురేందర్ రెడ్డి చేస్తున్న ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు.

 అఖిల్ కూడా ఏజెంట్ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube