రజినీకాంత్ సినిమాల్లో పని చేయడం నరకం తో సమానం అంటున్న లెజెండ్ .. కారణం ఏంటి?

ఏఆర్ రెహ్మన్. ఇండియన్ మ్యూజిక్ బ్రాండ్.

 Ar Rehman About Working With Rajinikanth Details, Ar Rehman, Rajnikanth, Ar Rahm-TeluguStop.com

దేశం గర్వించే సంగీత దర్శకుడు.ఆయన ఎన్నో సినిమాలకు సంగీతం అందించడంతో పాటు ఎన్నో ఆల్బమ్స్ చేశాడు.

ఆయన మ్యూజిక్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటాడు రెహ్మాన్.తన సంగీత ఒరవడికి రెండు ఆస్కార్ అవార్డులు సైతం దాసోహం అన్నాయి.

ఇంతటి ఘనుడైన రెహ్మాన్ కూడా ఓ హీరో సినిమాలు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఫీలవుతాడట.ఇంతకీ తను ఎవరో? ఎందుకు తను నరకంగా భావిస్తాడో? ఇప్పుడు తెలుసుకుందాం.

రజనీకాంత్. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్.ఆయన సినిమాలకు పనిచేసే అవకాశం వస్తే ఎవరైనా నో చెప్పరు.ఎగిరి గంతేస్తారు కూడా.

నటీనటులే కాదు.దర్శకులు, సంగీత దర్శకులు కూడా ఎంతో సంతోషిస్తారు.

ఆయనతో సినిమాలు చేయడంగౌరవంగా ఫీలవుతారు.అయితే దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ మాత్రం ఆయన సినిమాల్లో పని చేయడం అంటే నరకం అంటూ సంచలన కామెంట్స్ చేశాడు.

నిజానికి వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా అంటే ఎంతో క్రేజ్ ఉంటుంది.వీరు కలిసి చేసిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రజనీ సినిమాలపై రెహ్మాన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

Telugu Arrahman, Ar Rehman, Baba, Kollywood, Oscar Awards, Problems, Rajinikanth

ఆయన సినిమాలకు సంగీతం ఇవ్వడం అంటే చాలా ఇబ్బంది అన్నాడు.ఒక్కమాటలో చెప్పలంటే నరకం అన్నాడు.ర‌జ‌నీ సినిమాల‌కు సాధారణంగా మార్చిలో పని స్టార్ట్ అవుతుందన్నాడు.దీపావళి నుంచి ఆయన సినిమాలు విడుదల అవుతాయి.ఆ సమయంలో పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వాల్సి ఉంటుందన్నాడు.అయితే తాను ఉండే ప్రదేశాల్లో కరెంటు సమస్య ఉండేదన్నాడు.

Telugu Arrahman, Ar Rehman, Baba, Kollywood, Oscar Awards, Problems, Rajinikanth

రెండు జనరేటర్లు ఉన్నా.వర్క్ ఎక్కువగా ఉండటంతో పనిచేసేవి కాదన్నాడు.ఈ సమయంలో తనకు నరకంలా అనిపించేదని చెప్పాడు.

అందుకు తాను చాలా సార్లు దీపావళి, న్యూఇయర్, సంక్రాంతి పండగలను మిస్ అయినట్లు చెప్పాడు.అటు వీరి కాంబోలో వచ్చిన ముత్తు, అరుణాచలం, బాబా, శివాజీ, రోబో, 2.0 సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube