అందుకే ఈ మ్యూజిక్ డైరెక్టర్ చిత్ర పరిశ్రమని వదిలేసి వెళ్ళిపోయాడా..?

తెలుగులో ఒకప్పుడు విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తదితర స్టార్ హీరోల చిత్రాలకి సంగీత స్వరాలు సమకూర్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ “రమణ గోగుల” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే 1998వ సంవత్సరంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన “ప్రేమంటే ఇదేరా” చిత్రం ద్వారా రమణ గోగుల తన సినిమా కెరీర్ ని మొదలుపెట్టాడు.

 Music Composer Ramana Gogula Real Life News-TeluguStop.com

అప్పటి నుంచి 2013 సంవత్సరం వరకు దాదాపుగా 20 చిత్రాలకి సంగీతాన్ని అందించాడు.కానీ ఏమైందో ఏమో గాని గడచిన ఏడు సంవత్సరాలుగా రమణ గోగుల సినిమాలకి సంగీతం అందించడం లేదు.

కాగా ఈ విషయానికి సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

 Music Composer Ramana Gogula Real Life News-అందుకే ఈ మ్యూజిక్ డైరెక్టర్ చిత్ర పరిశ్రమని వదిలేసి వెళ్ళిపోయాడా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే అప్పట్లో రమణ గోగుల తెలుగులో ఓ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడని, కానీ ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోగా డిజాస్టర్ గా నిలిచిందట.

దీంతో పూర్తిగా ఆర్థిక సమస్యలతో రమణ గోగుల కొంత కాలం పాటు ఇబ్బందులు పడినప్పటికీ ఆ తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నట్లు కొందరు చర్చించుకుంటున్నారు.అయితే రమణ గోగుల నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఏదంటే సుమంత్ మరియు కృతి కర్బందా తదితరులు జంటగా నటించిన “బోని”.

కాగా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన అనంతరం రమణ గోగుల 2013 ఈ సంవత్సరంలో విడుదలైన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, 1000 అబద్దాలు తదితర చిత్రాలకి సంగీతం అందించాడు.ఆ తర్వాత ఏమైందో ఏమోగాని రమణ గోగుల ఇతర దేశాలకు వెళ్లి సెటిల్ అయ్యాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో రమణ గోగుల తమ్ముడు, ప్రేమంటే ఇదేరా, బద్రి, బద్రి (తమిళ్)  యువరాజు, జానీ, లక్ష్మీ, అన్నవరం, యోగి, ఆప్తుడు, తదితర చిత్రాలకు సంగీతాన్ని అందించాడు.అయితే ఇందులో అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కాకపోయినప్పటికీ సంగీతం పరంగా మాత్రం ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి.

ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలను అందించినటువంటి రమణ గోగుల ఉన్నట్లుండి సినిమా పరిశ్రమని వదిలిపెట్టి వెళ్లిపోవడంతో సినీ ఇండస్ట్రీ ఓ మంచి మ్యూజిక్ కంపోజర్ ని కోల్పోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

#BoniMovie #Music Composer #MusicComposer #Ramana Gogula #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు