సంగీతం ఆ రోగానికి ఔషధంలా పనిచేస్తుంది

అలోచనలు పెంచే శక్తి సంగీతానికి ఉంది, బాధల్ని తుంచే శక్తి సంగీతానికి ఉంది.మనిషి పడుతున్న కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి కొన్ని నిమిషాల పాటు విముక్తినిచ్చి, మరో ప్రపంచంలోకి మోసుకెళ్ళగల బలం సంగీతంలో ఉంది.

 Music Can Be Used As A Medicine In Cancer Treatment – Study-TeluguStop.com

అందుకే సంగీతాన్ని కూడా ఒక వైద్యంలా పరిగణించారు మన పూర్వీకులు.ఇప్పటికి కొన్నిరకాల మానసిక రోగాలకి మ్యూజిక్ థెరపి పేరుతో సంగీతాన్ని ఉపయోగించి ట్రీట్‌మెంటు ఇస్తారు.

అంత గొప్పదైన సంగీతం, క్యాన్సర్ పై కూడా ఒక ఔషధంలా పనిచేస్తుందని తాజా అధ్యయనాలు గట్టిగా చెవుతున్నాయి.

ఇటివలే ఇదే విషయంపై అమెరికాలోని డ్రెక్సెల్ యూనివర్సిటీలో ఒక పరిశోధన చేశారు.

అందులో 3700 మందికి పైగా క్యాన్సర్‌ పేషెంట్లు పాల్గొన్నారు.వారందరికీ ఆహ్లాదకరమైన సంగీతంతో మ్యూజిక్ థెరపి అందించగా, మంచి ఫలితాలు కనిపించాయి.

నొప్పిని, భయాన్ని, అలసటని తగ్గించడానికి సంగీతం సహాయపడింది.అలాగే పేషెంట్ల బ్లడ్ ప్రెషర్, రెస్పిరేటరీ రేట్ కూడా కంట్రోల్ లోకి వచ్చింది.

ఈరకంగా క్యాన్సర్ పేషెంట్లు వాడాల్సిన ఔషధాలలో మ్యూజిక్ కూడా ఉందని, ఇది మంచి ఫలితాలను రాబడుతుందని నిరూపితమైంది.మ్యూజిక్, మెడిసిన్ .ఈ రెండిటి అద్భుతమైన కలయికలో క్యాన్సర్‌ పేషెంట్లకు మంచి వైద్య సేవలను అందించవచ్చునని యూనివర్సిటీ పరిశోధకులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.అయితే ఏలాంటి క్యాన్సర్‌ కు ఎలాంటి సంగీతం, ఎలాంటి పద్ధతిలో వినిపించాలి అనే విషయం మీద మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని వారు చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube