పుట్టగొడుగులు(మష్రూమ్స్).వీటి గురించి పరిచయాలు అవసరం లేదు.
పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు.ఈ సీజన్ లో విరి విరిగా లభించే పుట్టగొడుగులు రుచిగా ఉండటమే కాదు.
ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.ఎందుకంటే, పుట్టగొడుగుల్లో విటమిన్-బి, విటమిన్ డి, ఫోలేట్, థయమిన్, పొటాషియం, రాగి, సెలీనియం, ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఇలా చాలా పోషకాలే ఉంటాయి.
మరి ఇన్ని పోషకాలు ఉన్న పుట్టగొడుగులను రెగ్యులర్‌గా తీసుకోవచ్చా? అన్న ప్రశ్న చాలా మందికి ఉంది.

ఇందుకు తీసుకోవచ్చనే సమాధానం ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు.అయితే అతిగా కాకుండా.సరైన మోతాదులో మాత్రమే పుట్టగొడుగులను తీసుకోవాలి.
అలా తీసుకుంటేనే అనేక హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు.
ప్రతి రోజు తగిన క్వాంటిటీలో మష్రూమ్స్ తీసుకుంటే మంచిది.ఎందుకంటే, పుట్టగొడుగుల్లో ఉండే ఫైబర్ మరియు ప్రోటీన్ బరువు వేగంగా తగ్గేందుకు సహాయపడతాయి.
అలాగే పుట్టగొడుగుల్లో వాటర్ కంటెంట్ అత్యధికంగా ఉంటుంది.అందువల్ల, పుట్టుగొడుగులను డైలీ డైట్‌లో చేర్చుకుంటే.డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.చర్మం కూడా ఎల్లప్పుడు మృదువుగా, కాంతివంతంగా కనిపిస్తుంది.
వృద్ధాప్యచాయలు దరి చేరకుండా ఉంటాయి.ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది విటమిన్ డిలో లోపంతో బాధ పడుతున్నారు.

అలాంటి వారు తప్పకుండా పుట్టగొడుగులను డైట్‌లో చేర్చుకుంటే.విటమిన్ డి లోపం పరార్ అవుతుంది.అజీర్తి, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ వంటి జీర్ణ సమస్యలతో తరచూ ఇబ్బంది పడే వారు పుట్టగొడుగులను తీసుకోవడం ఎంతో మేలు.జీర్ణ సమస్యలను నివారించి.జీర్ణ వ్యవస్థ పనితీరును పెంచడంలో పుట్టుగొడుగులు మెడిసిన్‌లా పని చేస్తాయి.అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి.
రెగ్యులర్‌గా తీసుకోవచ్చు కదా అని అధిక మొత్తంలో మష్రూమ్స్ తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదంగా మారుతుంది.