మధ్యాహ్న భోజనంలో పుట్టగొడుగులు, తేనె.. ఎక్కడో తెలుసా?

మన దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సరైన పరిమాణంలో భోజన సదుపాయం కల్పిస్తున్న విషయం అందరికీ తెలిసినదే.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఈ మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్నారు.

 Honey And Mushrooms In Mid Day Meals, Mushrooms And Honey , Lunch ,government Sc-TeluguStop.com

ఎంతో పోషక విలువలతో కూడిన ఆహారం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థికి అందజేస్తున్నారు.

అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తేనే, పుట్టగొడుగులను ఆహార మెనూలో అందించవలసినదిగా కేంద్ర విద్యా శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు.

గత కొద్ది సంవత్సరాలుగా మనదేశంలో పుట్టగొడుగులు, తేనె పెంపకం గణనీయంగా పెరిగింది.

ఎన్నో పోషక విలువలు కలిగిన తేనెను, పుట్టగొడుగులను మధ్యాహ్న భోజన పథకంలో చేర్చడం వల్ల ప్రతి ఒక్క విద్యార్థికి అవసరమైన అన్ని పోషకాలు అందడంతో వారు మానసికంగా, శారీరకంగా వారిలో పెరుగుదల కనిపించడమే కాకుండా, మెదడు పనితీరు కూడా చాలా చురుగ్గా సాగుతుంది.

పుట్టగొడుగుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం వల్ల ఇవి పిల్లల పెరుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలను ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తోంది.

అంతేకాకుండా ఈ భోజన పథకం కార్యక్రమాన్ని అమలు చేయడానికి గాను 15% అదనంగా నిధులు విడుదల చేయాలని కేంద్రానికి లేఖ రాసింది.మన దేశంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో భోజన పథకంలో భాగంగా వీటిని చేర్చడం వల్ల దాదాపు 11.59 కోట్ల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో అందుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube