ముషారఫ్‌ ఉరికి అంతా వ్యతిరేకం

పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు అక్కడి సుప్రీం కోర్టు దేశ ద్రోహం కేసులో ఉరి శిక్షను విధించిన విషయం తెల్సిందే.పాకిస్తాన్‌కు నష్టం కలిగించేలా ఆయన వ్యవహరించాడంటూ నిర్థారణ అయిన కారణంగా ముషారఫ్‌ కు ఉరి శిక్ష విధిస్తున్నట్లుగా కోర్టు ప్రకటించింది.

 Musharrafs Execution Is The Opposite-TeluguStop.com

అయితే ముషారఫ్‌కు ఉరి శిక్ష పడటంపై పాకిస్తాన్‌ మొత్తం అట్టుడుకుతుంది.సైన్యం నుండి మొదలుకుని ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వరకు అంతా కూడా ముషారఫ్‌ ఉరిని వ్యతిరేకిస్తున్నారు.

ఇప్పటికే సైన్యంకు చెందిన ముఖ్య అధికారులు ముషారఫ్‌ను ఉరితీసేందుకు వీలు లేదంటూ వ్యాఖ్యలు చేశారు.ఇక గతంలో ముషారఫ్‌ పై దేశ ద్రోహం కేసు నమోదు అవ్వడంను సమర్ధించిన ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇప్పుడు ఉరిని మాత్రం వ్యతిరేకిస్తున్నాడు.

ముషారఫ్‌కు ఉరి అనేది చాలా పెద్ద శిక్ష అవుతుందని, ఆయన చేసిన పనికి అంత పెద్ద శిక్ష అక్కర్లేదు అన్నట్లుగా ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం మరియు ఆయనకు చెందిన పార్టీ వారు భావిస్తున్నారు.ఈ విషయమై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న పరిస్థితులను చూస్తుంటే ముషారఫ్‌కు ఖచ్చితంగా ఉరి ఉండదనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube