అప్పట్లో కశ్మీరీలకు పాక్‌లో శిక్షణ ఇచ్చాం

పాకిస్థాన్‌ మరియు భారత్‌ల దూరం ఇంతగా పెరగడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి ముషారఫ్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఎందుకంటే గతంలో ముషారఫ్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పలు సందర్బాల్లో ఇండియాను రెచ్చగొట్టేల మాట్లాడటంతో పాటు అనేక రకాలుగా ఇండియాను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశాడు.

 Musharaf Comments On Indians In Kashmir Youth-TeluguStop.com

ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో ముషారప్‌ కీలకంగా వ్యవహరించాడు.ఆ వివాదాలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి.

ముషారఫ్‌ తర్వాత పలువురు అధ్యక్షులు ప్రధానులు వచ్చినా కూడా ఇండియాతో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇటీవల ముషారఫ్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆశ్చర్యకరంగా వ్యాఖ్యలు చేశాడు.

కశ్మీరి యువకులకు పాకిస్తాన్‌లో గతంలో శిక్షణ ఇచ్చేవాల్లం.భారత ఆర్మీతో పోరాడేందుకు వారికి కావాల్సిన మద్దతు మేము ఇచ్చామంటూ ముషారఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

బిన్‌ లాడెన్‌ మరియు జలాలుద్దీన్‌ వంటి వారు పాకిస్తానీ హీరోలు అని వారి వల్లే పాకిస్తాన్‌ అంటే ప్రపంచంలో గౌరవం దక్కిందంటూ వింత వ్యాఖ్యలు చేశాడు.గతంలో తాము తాళీబన్లకు కూడా శిక్షణ ఇచ్చినట్లుగా ఆయన పేర్కొన్నాడు.

ముషారఫ్‌ వ్యాఖ్యలపై అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube