'రూపాయి' కోసం బట్టలు ఉతికిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

ప్ర‌తీ ఒక్క‌రి విజ‌యం వెనుక ఎన్నో క‌ష్టాలు, క‌న్నీళ్లు ఉంటాయ‌న్న త‌ర‌హాలో ఆయ‌న జీవితంలో ఎన్నో క‌ష్టాలు, క‌న్నీళ్లు ఉన్నాయి.ఉండ‌డానికి నిలువ నీడ లేక…డైర‌క్ట‌ర్ అవ్వాల‌నే సంక‌ల్పం తో క‌ష్టాల్ని దిగ‌మింగుకొని తిన‌డానికి తిండిలేక.

 Director Murugadoss, Washed Clothes, One Rupee, Gajini Film, Tamilnadu-TeluguStop.com

, ఆక‌ల‌వుతుంటే కంటి నుంచి ధారాళంగా కారుతున్న క‌న్నీళ్ల‌తో క‌డుపు నింపుకున్నారు ఆ స్టార్ డైర‌క్ట‌ర్.ఇలా జీవితంలో ఆటుపోట్ల‌ను ఎదుర్కొని డైర‌క్ట‌రే ముర‌గ‌దాస్.

త‌నపిల్ల‌లు ఎదిగితే చూడాల‌ని ప‌రిత‌పించిపోయేవారు ముర‌గదాస్ తండ్రి అరుణా చ‌లం.క‌టిక పేద‌రికం.ఆపై సినిమాల‌పై ఉన్న కోరిక‌.ఆ కోరిక‌తో త‌ల్లితో దొంగ‌చాటుగా సినిమా చూసేవారు ముర‌గ‌దాస్.డిగ్రీపూర్తైన వెంట‌నే సినిమాల్లో ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పి చెన్నైకి ప‌య‌న‌మైన ముర‌గ‌దాస్ కు క‌ష్టాలు స్వాగ‌తం ప‌లికాయి.చెన్నైలో ఓ చిన్న‌గ‌ది అందులో ముర‌గ‌దాస్ తో పాటు మ‌రో వ్య‌క్తి ఉండేవాడు.

చెన్నై వ‌చ్చిన తొలి నాళ్ల‌లో ఇంటి ద‌గ్గ‌ర నుంచి వ‌చ్చే డ‌బ్బులతో ఒక‌రోజులో ఒక‌పూట తిని రెండు రోజు రోజులు ప‌స్తులుండే ముర‌గ‌దాస్ ఇంటి అద్దె క‌ట్ట‌క ఆరు నెల‌లవుతుంది.

తిన‌డానికి తిండి లేదు.

క‌ట్ట‌డానికి చేతిలో డ‌బ్బులు లేవ‌ని రూమ్ లో ప‌డుకొని ఉండ‌గా … రూమ్ లో ఉండే మ‌రో వ్య‌క్తి బ‌ట్ట‌ల‌మూట ఎదురేసుకొని ఉతుకుతూ క‌నిపించాడు.విష‌యం ఏంటా అని ఆరాతీస్తే ఒక్క జ‌త ఉతికితే రూపాయి ఇస్తార‌ని సంతోషంగా చెప్పాడు.

దీంతో తెగ ఆనంద ప‌డిపోయిన ముర‌గదాస్ బ‌ట్ట‌లుతికి క‌డుపునింపుకునే వారు.ఓ స‌మ‌యంలో ముర‌గ‌దాస్ బ‌ట్టులుతుకుతుండ‌గా ఇంటి ఓన‌ర్ చూడ‌డంతో ఏం చేయాలో పాలు పోక త‌ల‌వంచుకున్నాడు.

ఏం బతుకులురా మీవి.ఏం చేయాల‌ని చెన్నైకి వ‌చ్చారు.

ఏం చేస్తున్నార‌ని తిట్టాడు ఓన‌ర్.

ఇల్లు ఖాళీ చేయాలంటూ ముర‌గ‌దాస్ ను నెట్టాడు.

దుఖంతో కంటి నుంచి వ‌స్తున్న క‌న్నీటిని ఆపుకుంటూ సార్.మ‌న బ‌ట్ట‌లేసి ఉతికితే వేరేవాళ్ల‌కు డబ్బు‌లొస్తాయ్.

అదే బ‌ట్ట‌ల్ని మ‌నం ఉతికితే త‌ప్పేంటి సార్ అని ముర‌గ‌దాస్ అన‌డంతో.ఆ మాట‌ల‌కు క‌న్నీటి ప‌ర్యంత‌మైన ఓన‌ర్ అమాంతంగా హ‌గ్ చేసుకున్నాడు.

ఆ స‌మ‌యంలో తండ్రి చ‌నిపోవ‌డంతో క‌ష్టాలు ఇంకా ఎక్కువ‌య్యాయి.త‌న తండ్రి క‌ల‌ను సాకారం చేసేందుకు క‌ష్ట‌ప‌డ్డారు.

Telugu Murugadoss, Gajini, Rupee, Tamilnadu, Washed-Movie

మెల్ల‌మెల్ల‌గా కామెడీ డైలాగ్స్, స్కెచ్చెస్, స్టేజ్ ఆర్టిస్ట్ గా చేస్తున్న స‌మ‌యంలో మ‌ధురై మీనాక్షి సినిమాకు డైలాగ్ రైట‌ర్ గా అసిస్టెంట్ డైర‌క్ట‌ర్ గా వెండితెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు ముర‌గ‌దాస్. అలా 2001 ధీనా సినిమాతో డైర‌క్ట‌ర్ గా కెరియ‌ర్ ను ప్రారంభించారు.రెండో సినిమా ర‌మ‌ణ‌తో ఓవర్ నైట్ స్టార్ డైర‌క్టర్ గా పేరుగ‌డించారు.మూడో సినిమా గ‌జినీతో త‌మిళ్, తెలుగు లో రికార్డ్ లు క్రియేట్ చేశారు.అంత‌టి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న ముర‌గ‌దాస్ త‌న సుఖం వెనుక ఉన్న క‌ష్టాన్ని గుర్తు చేసుకుంటారు.ఎంత స్టార్ డ‌మ్ ఉన్నా త‌న తండ్రి త‌న ఎదుగుద‌ల చూసి ఉంటే బాగుండేద‌ని బాధ‌ప‌డుతుంటారు ముర‌గ‌దాస్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube