ఖైదీ నం 150 చూసి మురుగదాస్ ఫీల్ అయ్యాడా?     2017-01-11   21:43:06  IST  Raghu V

అప్పుడెప్పుడో మురుగదాస్ తీసిన రమణ చిత్రాన్ని “ఠాగూర్” గా రీమేక్ చేసి బంపర్ హిట్ కొట్టారు చిరంజీవి – వినాయక్. ఇప్పుడు మళ్ళీ అదే మురుగదాస్ తీసిన “కత్తి” చిత్రాన్ని ఖైదీనం 150 పేరుతో రిమేక్ చేసారు. తమిళంలో ఇదే కథకు ఆహో ఓహో అనే రివ్యూలు వస్తే, ఖైదీకి మాత్రం ఎందుకు బాగుంది, ఫర్వాలేదు అనే రెస్పాన్స్ వచ్చింది?

మురుగదాస్ సినిమాని అంతే నేర్పుతో వినాయక్ హ్యాండిల్ చేసాడా చేయలేదా అనే విషయం పక్కనపెడితే, ప్రస్తుతం మహేష్ సినిమా షూటింగ్ పనిమీద హైదరాబాద్ లోనే ఉన్న మురుగదాస్ ఖైదీ సినిమా చూసారని, ఆయనకి కథలో వినాయక్ చేసిన మార్పులు నచ్చలేదని టాక్ నడుస్తోంది.

సీరియస్ కథలో వినాయక్ చొప్పించిన కామెడీ, అవసరం లేకున్నా చిరంజీవి పొలిటికల్ మైలేజ్ కోసం డైలాగులు, బ్రహ్మానందం, ఆలీ కామెడి, చివర్లో చేసిన మార్పు, ఇవేవి మురుగదాస్ కి నచ్చలేదని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజామో, అబద్ధమో .. మురుగదాస్ శైలికి పూర్తి భిన్నమైన దర్శకుడు వినాయక్. మరీ ఇద్దరి ట్రీట్‌మెంటులో తేడా ఉంటుందిగా.