తుపాకి 2.. హీరోని మార్చేసిన మురుగదాస్..!

మురుగదాస్ డైరక్షన్ లో విజయ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ తుపాకి.తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఆ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది.మురుగదాస్ కథ, కథనం.విజయ్ నటన సినిమాకు హైలెట్ గా నిలిచాయి.తుపాకి తర్వాత చాలా గ్యాప్ తో మురుగదాస్ తో విజయ్ సర్కార్ సినిమా చేశాడు.ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

 Murugadoss Change Hero For Tupaki 2, Kamal Hassan , Kollywood,  Latest News , Mo-TeluguStop.com

అయితే తుపాకి సీక్వల్ గా తుపాకి 2 కథ రెడీ చేశాడు మురుగదాస్.ఆ సినిమా కథ విజయ్ కు నచ్చలేదో మరి ఏమో కాని తుపాకి 2 నుండి విజయ్ తప్పుకోగా ఆ ప్రాజెక్ట్ లోకి కమల్ హాసన్ ఎంటర్ అయినట్టు తెలుస్తుంది.

కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా అర్ధాంతరంగా ఆగిపోగా ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ల మీద ఫోకస్ పెట్టాడు.మురుగదాస్ తుపాకి 2 కథ చెప్పడంతో ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట కమల్ హాసన్.

ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ డైరక్టర్ గా ఉన్న మురుగదాస్ ఈమధ్య కెరియర్ లో వెనకపడ్డాడు.ఓ పక్క కమల్ హాసన్ కూడా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.

ఈ ఇద్దరి కాంబో సూపర్ హిట్ అందిస్తుందేమో చూడాలి.మురుగదాస్ మాత్రం తన మునుపటి ఫాం లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు.

తుపాకి ఎలాగు సూపర్ హిట్ కాబట్టి ఆ సినిమా సీక్వల్ తో పక్కా మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube