పాన్ ఇండియా మూవీ నిర్మించబోతున్న మురుగదాస్

సౌత్ ఇండియాలో శంకర్ తర్వాత ఆ స్థాయిలో స్టార్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మురుగదాస్.సోషల్ ఎలిమెంట్ తీసుకొని దానిని కమర్షియల్ యాంగిల్ లో ప్రెజెంట్ చేస్తూ సినిమాలు చేయడం మురుగదాస్ ప్రత్యేకత.ఈ కారణంగానే అతను ఎక్కువగా హిట్ సినిమాలు చేశాడు.ఓ వైపు దర్శకుడుగా ఉంటూనే మరో వైపు నిర్మాతగా మారి తన శిష్యులని దర్శకులుగా పరిచయం చేయడం మొదటిగా మురుగదాస్ సౌత్ లో ప్రారంభించాడు.

 Murugadas Produce Pan India Movie-TeluguStop.com

అతనిని సుకుమార్ ఫాలో అయ్యాడు.మురుగదాస్ శిష్యుడుగానే ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ దర్శకులలో ఒకడిగా ఉన్నా అట్లీ పరిచయం అయ్యాడు.ప్రస్తుతం మురుగదాస్ తుపాకీ సీక్వెల్ కోసం ప్లాన్ చేస్తున్నాడు.ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతున్నట్లు బోగట్టా.

విజయ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా కంప్లీట్ అయిన తర్వాత మురుగదాస్ తో తుపాకీ సీక్వెల్ స్టార్ట్ చేస్తాడు.

 Murugadas Produce Pan India Movie-పాన్ ఇండియా మూవీ నిర్మించబోతున్న మురుగదాస్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే మురుగుదాస్‌ 1947 అనే పాన్‌ ఇండియా మూవీ చేయబోతున్నట్టు ప్రకటించారు.

బాలీవుడ్‌ ప్రొడ్యూసర్‌ ఓం ప్రకాష్‌ భట్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.విష్ణువర్ధన, యాజమాన్య వంటి చిత్రాలు తీసిన దర్శకుడు పోన్‌ కుమారన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

ప్రస్తుతం 1947 సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా ఫ్రీడమ్ ఫైట్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నారా లేదంటే సోషల్ కాన్సెప్ట్ గానే ఆవిష్కరుస్తున్నారా అనేది తెలియరాలేదు.త్వరలో ఈ సినిమాకి సంబంధించి క్యాస్ట్ అండ్ క్రూని పరిచయం చేయనున్నట్లు మూవీ ప్రకటన సందర్భంగా మురుగదాస్ తెలియజేయడం విశేషం.

#Murugadas #Ponnu Kumaran #Kollywood #Pan India Movie #Tupaki Sequel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు