మురుగదాస్‌ పాన్‌ ఇండియా సినిమాపై మరో అప్‌డేట్‌ వచ్చింది

తమిళ సూపర్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ ప్రస్తుతం ఒక భారీ పాన్‌ ఇండియా సినిమాను ప్లాన్‌ చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి.

 Muruga Dos Pan India Movie News-TeluguStop.com

అయితే ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన నేపథ్యం ఏంటీ.ఇంతకు హీరో ఎవరు అనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు.

కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు 1947 అనే టైటిల్‌ ను ఖరారు చేయడం జరిగింది.ఈ టైటిల్‌ ను చూస్తుంటే ఈ సినిమా నేపథ్యం ఏంటీ అనే విషయంలో చాలా రకాల ఊహాగాణాలు వస్తున్నాయి.

 Muruga Dos Pan India Movie News-మురుగదాస్‌ పాన్‌ ఇండియా సినిమాపై మరో అప్‌డేట్‌ వచ్చింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం మురుగదాస్ స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో సినిమాను తీసేందుకు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.మురుగదాస్ బ్యానర్‌ లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్న నేపథ్యంలో బాలీవుడ్‌ హీరో లేదా సౌత్‌ స్టార్‌ హీరోను ఎంపిక చేసే అవకాశం ఉంది.

పాన్ ఇండియా సినిమా కనుక ఉత్తరాదిన కూడా భారీ క్రేజ్ ఉన్న హీరోను ఎంపిక చేయాల్సి ఉంది.తమిళ హీరోల్లో అలాంటి హీరోలు ఎవరు లేరు.అందుకే తెలుగు లేదా హిందీ భాషల నుండి హీరోను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.పెద్ద మొత్తంలో ఈ సినిమా పై బాలీవుడ్‌ నిర్మాత ఖర్చు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాడు.

కనుక పాన్ ఇండియా సినిమా రేంజ్ లోనే ఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.పాన్‌ ఇండియా సినిమా లేదా ఛారిత్రమాత్మక నేపథ్యం సినిమాను మురుగదాస్ ఇప్పటి వరకు చేసింది లేదు.

మొదటి సారి ఈ సినిమాను ఆయన చేయబోతున్న నేపథయంలో ఖచ్చితంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి.సూపర్‌ స్టార్‌ తో ఈ సినిమా చేయడం వల్ల భారీ ఎత్తున అంచనాలు ఉంటాయని అంటున్నారు.

మురుగదాస్ గత చిత్రం రజినీకాంత్‌ తో చేయడం జరిగింది.ఆ సినిమా యావరేజ్ టాక్‌ ను దక్కించుకుంది.

#Muruga Dos #Pan India Movie #TamilStar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు