పేర్నిపై హ‌త్యాయ‌త్నం.. వెనుక నిజాలు ఇవేనా ?

మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది.ఈ విష‌యం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.

 Murder Attempt On Perni Nani.. This Is The Truth Behind Scenes,ap,ap Political N-TeluguStop.com

అయితే నానిపై ఇప్పుడు జ‌రిగింది ఇదే తొలిసారి కాదు.కొన్నాళ్ల కింద‌ట కూడా ఒక వ్య‌క్తి.

ఇలానే వ్య‌వ‌హ‌రించారు.దీంతో అప్ప‌ట్లోనూ తీవ్ర సంచ‌ల‌నం ఏర్ప‌డింది.

ప్ర‌స్తుత ఘ‌ట‌న‌లో తాపీమేస్త్రీ ఒక‌రు.మంత్రిపై హ‌త్యాయ‌త్నానికి ప్ర‌య‌త్నించార‌ని పోలీసులు తెలిపారు.స‌రే! ఇప్ప‌టికే వైసీపీ నాయ‌కుల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్న ఘ‌ట‌న‌లు క‌నిపిస్తూనే ఉన్నాయి.ఎంపీల‌పై రాళ్లు రువ్వ‌డం, ఎమ్మెల్యేల‌ను నిల‌దీయ‌డం.వంటివి కూడా చోటు చేసుకుంటున్నాయి.అయితే.

దీనివెనుక కార‌ణాలేంటి? ఎందుకు ఇలా జ‌రుగుతున్నాయి? అనే విష‌యాలు అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

జ‌రుగుతున్న ఘ‌ట‌న‌ల‌ను జ‌రుగుతున్న‌ట్టుగా కాకుండా వీటి వెనుక ఉన్న వాస్త‌వాల‌ను గుర్తించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

ప్ర‌జ‌ల‌కు నిధులు పంచుతున్నాం క‌నుక చాలా హ్యాపీ పాల‌న ఉంద‌ని జ‌గ‌న్ చెబుతున్నారు.ఇక‌, మంత్రులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు.అయితే.ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచుతున్నా అన్ని వ‌ర్గాలకు కావ‌నే విష‌యం ఇక్క‌డ ప్ర‌ధానంగా ప‌రిశీలించాల్సిన విష‌యం.

అంతేకాదు నిరంత‌రం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల్సిన నాయ‌కులు మొక్కుబ‌డిగా వ్య‌వ‌హ‌రించ‌డం కూడా అనేక వివాదాల‌కు ఆస్కారంగా మారింది.దీంతో ఇది అంతిమంగా ప్ర‌జ‌ల్లో అసంతృప్తికి దారితీస్తోంది.

ఇది ఆవేద‌న, ఆందోళ‌న స్థాయిలు దాటి.ఆక్రోశం వ‌ర‌కు చేరుకుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌ను ప‌రిశీలిస్తే.తాపీ మేస్త్రీ నిందితుడే! కానీ, ఒక చిన్న వ్య‌క్తి అందునా రోజు వారి కూలి చేసుకునే వ్య‌క్తిలో ఎందుకు ఇంత ఆక్రోశం.? అనేది త‌ర‌చి చూడాల్సి ఉంది.ప్ర‌స్తుతం రాష్ట్రంలో దెబ్బ‌తిన్న ప్ర‌ధాన రంగం ఏదైనా ఉంటే.

రియ‌ల్ ఎస్టేట్‌, నిర్మాణ రంగం.జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.తొలి ఆరు మాసాలు ఇసుక ల‌భించ‌లేదు.ఇసుక విధానంలో లోపాలు ఉన్నాయ‌ని, అక్ర‌మాలు జ‌రిగాయ‌ని పేర్కొంటూ దీనిని ఆపేశారు.దీంతో తీవ్రంగా నిర్మాణ‌రంగం న‌ష్ట‌పోయింది.

Telugu Ap, Attempt, Perni Nani, Complaint, Ysrcp-Political

ఇక‌, కోలుకుంటున్న ద‌శ‌లో.ఆరు మాసాలుగా క‌రోనా కార‌ణంగా ప‌నులు నిలిచిపోయాయి.ఈ ప‌రిస్థితి.

కార్మికుల‌ను రోడ్డు పాలు చేసింది.ఇప్పుడు కూడా ఇసుక ల‌భించ‌డం లేదు.

ఈ ప‌రిణామాల‌తోనే కార్మికుడైన తాపీ మేస్త్రీలో ఆగ్ర‌హం పెల్లుబికింద‌ని అంటున్నారు.మ‌రి దీనికి త‌ప్పు ఎవ‌రిది?  ఎవ‌రిని బాధ్యుల‌ను చేయాలి?  ప్ర‌త్య‌క్షంగా అయితే కార్మికుడిదే త‌ప్ప‌ని అంటున్నా ప‌రోక్షంగా ప్ర‌భుత్వానిది కాదా?! అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌!! ఏదేమైనా విధానాల‌పై స‌మీక్ష చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube