టీడీపీలో చేరి తప్పు చేశా... మురళీ మోహన్ సంచలన వ్యాఖ్యలు

రాజకీయాలలో ఒక పార్టీలో చేరి అందులో అన్ని రకాల పదవులు అనుభవించి, అలాగే నాలుగు రాళ్ళు వెనకేసుకొని తరువాత ఆ పార్టీ ఓడిపోగానే అధికారంలో ఉన్న పార్టీలో చేరిపోయి తనకి జీవితం ఇచ్చిన పార్టీ మీద విమర్శలు చేయడం, తనకి పదవులు కట్టబెట్టిన నాయకుడు మీద ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం అలవాటుగా మారిపోయింది.రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు.

 Murali Mohan Sensational Comments On Politics, Tdp, Ap Politics, Chandrababu Nai-TeluguStop.com

ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ గెలిపించిన ప్రజలని పక్కన పెట్టి తమ స్వలాభం చూసుకుంటారు.ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి రాజకీయాలే నడుస్తున్నాయి.

ఇష్టానుసారంగా పార్టీ కండువాలు మార్చేస్తున్నారు.అయితే టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ, సినీ నటుడు మాగంటి మురళీమోహన్ సొంత పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన అతను తనకి రాజకీయాలంటే అసలు ఇంటరెస్ట్ లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాలు తనకు ఇష్టం లేదని చెప్పినా చంద్రబాబు కన్వెన్స్ చేసి తీసుకొచ్చారని , ఆ పదేళ్ల టైంలో చాలా కోల్పోయానని, రాజకీయాలంటే విరక్తి కలిగేలా చేశారంటూ సంచలన కామెంట్స్ చేశారు.

ఇక చాలు ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయను.యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండటం నా వల్ల కాదు.ఎనభై ఏళ్లలో ఇంకా పార్టీ కోసం పనిచేయడం నా వల్ల కాదని గుడ్ బై చెప్పి వచ్చేశా’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.మురళీమోహన్ 2009లో టీడీపీ నుంచి రాజమండ్రి ఎంపీగా పోటీచేసి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓడారు.తర్వాత 2014లో తిరిగి పోటీ చేసి ఎంపీగా గెలిచారు.2019 ఎన్నికల్లో పోటీకీ దూరంగా ఉండటమే కాకుండా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.ప్రస్తుతం తన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్న మురళీమోహన్ ఇప్పుడు రాజకీయంగా అన్ని అనుభవించి, వాటికి దూరమైనా వెంటనే పార్టీపైన, అలాగే రాజకీయాలపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం వెనుక కారణం ఏంటో అని అందరూ ఆలోచిస్తున్నారు.ఇక తన అవసరాల కోసం వైసీపీకి దగ్గరయ్యే ప్రయత్నం మురళీమోహన్ చేస్తున్నారా అనే అనుమానం కూడా టీడీపీ వర్గాలలో వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube