మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్ రానే వచ్చింది.ఉపఎన్నికకు ఈనెల 7న నోటిఫికేషన్ విడుదల కానుంది.

 Munugodu Assembly By Election Schedule Released-TeluguStop.com

నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనున్నారు.అదేవిధంగా నవంబర్ 6న ఎన్నిక కౌంటింగ్ నిర్వహించనున్నారని తెలుస్తోంది.

నామినేషన్ దాఖలకు ఈనెల 14 వరకు సమయం ఉండగా.ఈ నెల 17 వరకు నామినేషన్ ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది.

ఈ మేరకు ఉప ఎన్నిక షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.అయితే మునుగోడు ఉప ఎన్నిక హరిలో మూడు ప్రధాన పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే.

నామినేషన్ ప్రక్రియ నుండి పోలింగ్ వరకు అతి కొద్ది సమయం మాత్రమే ప్రచారానికి ఉంది.ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని పార్టీ అధిష్టానం ప్రకటించగా.

బిజెపి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు.అదేవిధంగా మునుగోడు బరిలో బి ఆర్ ఎస్ గా పోటీకి దిగుతామన్న కేసీఆర్.

అభ్యర్థి ప్రకటన చేయలేదు.ఉప ఎన్నికకు షెడ్యూల్ కూడా రావడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube