మున్నూరుకాపు దెబ్బ తెరాసపై పడనుందా..? ఇంకొన్ని రోజులైతే ఆ స్థానాలు 7 కి చేరవచ్చు.!  

  • తెలంగాణ లో మున్నూరుకాపులు జనాభా అత్యధికం.వరంగల్, నిజామాబాద్, కరీంనగర్,ఆదిలాబాద్,హైద్రాబాద్ జిల్లాల్లో అయితె వీళ్ళు రాజకీయంగా ఎటు వైపు ఉంటే అటు వైపు రాజకీయాలు మారులుతాయి.తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఈ సామాజిక వర్గం,తెరాస ప్రభుత్వం వచ్చాక ప్రాధాన్యం ఇచ్చినట్లు పైకి కనిపించిన కూడా లోపల అణగదొక్కే కుట్రలు బాగా జరిగాయని గత 6 నెలలుగా మున్నూరుకాపు నాయకుల ఆవేదన చూస్తే తెలిసిందే.

  • Munnuru Kapu Community Effect On TRS Party-

    Munnuru Kapu Community Effect On TRS Party

  • అయితే ఎన్నికల ముందు మాత్రం మున్నూరుకాపు లు తెరాస మీద చేస్తున్న ఆత్మగౌరవ దండయాత్రతో జిల్లా జిల్లాలల వారిగా తెరాసకు గడ్డురోజులు చవిచూస్తున్నారు.మొన్నటికి మొన్న నిజామాబాద్ జిల్లాలో ధర్మపురి కుటుంబం చేసిన తిరుగుబాటుతో నిజామాబాద్ జిల్లాలో తెరాస గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది.ఎంతలా అంటే తెరాసకు అండగా ఉండే నిజామాబాద్ జిల్లా ఈసారి తెరాస 3 వ స్థానానికి పడిపోయింది.ఇటీవల కొండా దంపతులు చేసిన తిరుగుబాటుతో వరంగల్ జిల్లాలో 5 స్థానాలకు ఎసరు వచ్చిందని సర్వేలో చెబుతున్నాయి.ఇంకా కొన్ని రోజుల తరువాత ఆ స్థానాలు 7 కి చేరవచ్చని విశ్లేషకుల అభిప్రాయం.

  • ఇపుడు ఆ సెగ అదిలాబాద్ జిల్లాకు చేరింది.నిర్మల్ మున్సిపల్ చైర్మైన్ అప్పల గణేష్ నాయకత్వంలో ,20 మంది కౌన్సిలర్లు మూకుమ్మడిగా తెరాసను వీడటం కాంగ్రెస్ లో చేరటం ఆ పార్టీని కలవరపెడుతోంది.ఈ పరిణామంతో ఆదిలాబాద్ జిల్లాలో మున్నూరుకాపు ఓట్లతో పాటు,బీసీల ఓట్లు కూడా తెరాసకు వ్యతిరేకంగా పడొచ్చని షాకింగ్ సర్వేలు చెబుతున్నాయి.వాస్తవానికి ఇపుడు తెరాసను వీడిన వాళ్ళు మొత్తం ఒకప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి వీర విధేయులు.గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి మున్సిపల్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఈ బృందం ఇపుడు తెరాసకు దూరం కావటం ఆ పార్టీని కలవరపెడుతోంది.ఈ మూడు జిల్లాలో తెరాసను ఒంటరి చేసిన మున్నూరుకాపు లు రానున్న రోజుల్లొ మిగతా జిల్లాలో కూడా తిరుగుబాటు చేసి వాళ్లకు జరిగిన అన్యాయానికి ప్రజాస్వామ్య బద్దంగా ప్రతీకారం తీర్చుకోవచ్చని విశ్లేషకుల అంచనా