మున్సిపల్‌ క్యాంపు రాజకీయాలు మొదలు  

Muncipal Elections Results On Tomorrow - Telugu Bjp And Trs And Congress, Muncipal Chairmans, Muncipal Elections, Muncipal Elections Results, Telangana Muncipal Elections

తెలంగాణలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు రేపు రాబోతున్న విషయం తెల్సిందే.రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలు అయితే మద్యాహ్నం వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Muncipal Elections Results On Tomorrow

రేపు సాయంత్రం వరకు మొత్తం ఫలితంపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.అయితే మున్సిపాలిటీల్లో చైర్మన్‌ పదవి కోసం కౌన్సిలర్లకు వల వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి అవతలి పార్టీలు లాక్కునే అవకాశాలు చాలా ఉంటాయి.అందుకే ఆయా పార్టీలు క్యాంపు రాజకీయాలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.

ప్రతి మున్సిపాలిటీ మరియు కార్పోరేషన్‌లో పార్టీల భీపామ్‌లపై గెలిచిన అభ్యర్థులను క్యాంపులో ఉంచబోతున్నారు.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి మరియు కాంగ్రెస్‌లు ఈ క్యాంపు రాజకీయాలను మొదలు పెట్టాయి.

హోరా హోరీగా సాగే మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డు మెంబర్‌కు కోట్ల రూపాయలు ధర పలికే అవకాశం ఉంది.అందుకే తమ పార్టీ అభ్యర్థులతో ఎవరు కూడా చర్చలు జరుపకుండా ముందే పార్టీ నాయకులు చర్యలు తీసుకుంటుకున్నారు.

రేపు పరిస్థితి ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈనెల 27వ తారీకు వరకు ఈ క్యాంపు కొనసాగనున్నాయి.27న చైర్మన్‌ మరియు మేయర్‌ పదవులకు నియామకం జరుగనుంది.

తాజా వార్తలు