లోకంలో తప్పు చేసిన వారు తప్పించుకోలేరని నిరూపించిన సంఘటన.ఇంతకు ఏం జరిగిందో తెలుసుకుంటే.
మహారాష్ట్రలోని ముంబైకి చెందిన 28 సంవత్సరాల యువతి గత మూడు సంవత్సరాలుగా దుబాయ్‌లో పని చేస్తున్నది.కాగా గత ఏడాది మార్చి 14 న ముంబైకి వచ్చింది.
అలా ఇంటికి వచ్చిన ఆ యువతి తన ఇంటికి వెళ్లకుండా లవర్‌తో కలిసి గోవా టూర్‌కు వెళ్లి, వారం రోజులు ఎంజాయ్ చేసి, మార్చి 20 న ముంబైలోని తన ఇంటికి వెళ్లిందట.ఈ క్రమంలో తాను ఇప్పుడే దుబాయ్ నుంచి వస్తున్నట్లు అబద్ధం ఆడిందట.
అందుకు రుజువులుగా మార్చి 14 కు బదులుగా మార్చి 20 కి మార్పు చేసిన పాస్‌పోర్ట్ ను చూపించిందట.దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు నమ్మినారట.
ఇక తిరిగి ఆ యువతి ఈ నెల 19 న దుబాయ్‌కు వెళ్లేందుకు ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకోగా అక్కడున్న ఇమ్మిగ్రేషన్ అధికారి ఒకరు ఆమె పాస్‌పోర్ట్ లో ఉన్న తప్పుడు తేదీని గమనించాడట.దీనిపై ఆ యువతిని ప్రశ్నించగా కంగుతిన్న ఆ యువతి జరిగిన విషయం చెప్పక తప్పలేదు.
దీంతో ఆమె పై పాస్‌పోర్ట్ ఫోర్జరీ, మోసం ఆరోపణల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.చూశార తప్పుచేసి ఎవరికి తెలియకుండా ఎంజాయ్ చేసిన ఆ యువతిని రహస్య గోవా ట్రిప్ పెద్ద చిక్కులో పడేసింది.