పాయల్ ఆరోపణల పై ఆ దర్శకుడికి సమన్లు…!  

Mumbai Police Summons Anurag Kashyap Over The Sexual Assault Allegations, Anurag Kashyap,Payal Ghosh, Sexual Assault Allegations, Mumbai Police, PM Modi - Telugu Anurag Kashyap, Mumbai Police, Mumbai Police Summons Anurag Kashyap Over The Sexual Assault Allegations, Payal Ghosh, Pm Modi, Sexual Assault Allegations

బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ ఇటీవల బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆమె కేసు కూడా నమోదు చేసింది.

TeluguStop.com - Mumbai Police Summons Anurag Kashyap Over The Sexual Assault Allegations

అయితే పాయల్ ఆరోపణల నేపథ్యంలో దర్శకుడు అనురాగ్ కశ్యప్ కు సమన్లు జారీ అయినట్లు తెలుస్తుంది.బాలీవుడ్ దర్శకుడు కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని తనను రూమ్ కి పిలిచి చాలా అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ ఆమె ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

నేను ఏ హీరోయిన్ ను పిలిచినా ఇక్కడకి వచ్చి ఎంజాయ్ చేస్తుంది అంటూ తనతో చాలా అసభ్యంగా మాట్లాడినట్లు పాయల్ ఆరోపణలు చేసింది.అయితే పాయల్ ఆరోపణలను ఖండించిన కశ్యప్ కు పలువురు బాలీవుడ్ భామలు కూడా సపోర్ట్ గా నిలిచారు.

TeluguStop.com - పాయల్ ఆరోపణల పై ఆ దర్శకుడికి సమన్లు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కశ్యప్ అలాంటి వారు కాదని,ఒకవేళ ఆయన అలాంటి వాడు అని తెలిస్తే అతనితో ఇక సంబంధాలు తెంచుకుంటాను అంటూ బాలీవుడ్ నటి తాప్సి పన్ను కూడా వ్యాఖ్యలు చేసింది.అయితే పాయల్ మాత్రం అతడి లాంటి దర్శకుడి ని ఎప్పుడూ చూడలేదని, అతడి తరువాత తాను మరే దర్శకుడి నుంచి అలాంటి అనుభవాలను ఎదుర్కోలేదని తెలిపింది.

ఈ వ్యవహారంపై పాయల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తో ఆయన పై ఐపిసి సెక్షన్ 376 354 341 342 కింద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.అయితే ఈ కేసు దర్యాప్తును త్వరగా నిర్వహించి తనకు న్యాయం చేయాలని లేదంటే నిరాహార దీక్ష చేస్తానంటూ పాయల్ వ్యాఖ్యలు చేసింది.

అంతేకాకుండా తనకు ప్రాణహాని ఉందంటూ ప్రధాని మోడీ ని సైతం కోరిన పాయల్ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యరి ని కూడా కలిసి దీనిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలోనే పోలీసులపై ఒత్తిడి రావడం తో అనురాగ్ కి సమన్లు జారీ చేయగా, త్వరలో అతడిని పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తుంది.

#PM Modi #Anurag Kashyap #Payal Ghosh #SexualAssault #MumbaiPolice

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mumbai Police Summons Anurag Kashyap Over The Sexual Assault Allegations Related Telugu News,Photos/Pics,Images..