తప్పు చేస్తూ దొరికిన ప్రముఖ బాలీవుడ్ న‌టుడు.. పోలీసులు ఏం చేశారంటే..?

ట్రాఫిక్ నిబంధనల విషయంలో పౌరులు తప్పు చేస్తే అధికారులు తెలియచేస్తారు.అంతే కాకుండా ప్రముఖ సెలబ్రీటీలతో ప్రజలకు చెప్పిస్తారు.

 Mumbai Police Fine On Bollywood Actor For Riding Without Helmet-TeluguStop.com

ఎందుకంటే కనీసం అధికారుల మాట వినకున్న, అభిమాన హీరోలు అయినా చెబితే కొందరైనా వింటారనే నమ్మకం.కానీ వారే తప్పుచేసి పప్పులో కాలెస్తే.

అభిమానులు ఊరుకుంటారు గానీ పోలీసులు ఊరుకోం అని ఫైన్ వేశారు.

ఎవరి విషయంలో అని ఆలోచిస్తున్నారా.

అతనే ప్రముఖ బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబేరాయ్.వాలంటైన్స్ డే సంద‌ర్భంగా త‌న శ్రీమ‌తి గిఫ్ట్ గా బైక్ ఇచ్చిందట.

ఆ ఆనందంలో వివేక్ ఆమెను ఎక్కించుకొని ముంబై వీధుల్లో చ‌క్క‌ర్లు కొట్టాడు.అంతటితో ఊరుకోకుండా ఇందుకు సంబంధించిన వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌డంతో పోలీసులు అత‌నిపై కేసు న‌మోదు చేశారు.

బైక్ పై తిరిగితే ఫైన్ ఎందుకంటారా.అయితే వివేక్ క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డంతో పాటు హెల్మెట్ లేకుండా బైక్‌పై చ‌క్క‌ర్లు కొట్టినాడట అందుకే ఇతని పై జుహూ పోలీస్ స్టేష‌న్‌లో ఐపీసీ సెక్ష‌న్ 188 క్రింద కేసు న‌మోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు.

అదీగాక ఐదు వందల రూపాయ‌ల చ‌లానా కూడా విధించారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube