సుశాంత్‌ కేసు : సీబీఐ వారికి కూడా చుక్కలు చూపిస్తున్న ముంబయి పోలీసులు  

CBI Officials Seek Mumbai Police permission Sushanth Case, Sushanth Singh Rajput Case, Death Mystery, Bihar CM Nitish Kumar - Telugu Bihar Cm Nitish Kumar, Cbi Officials Seek Mumbai Police Permission Sushanth Case, Death Mystery, Sushanth Singh Rajput Case

సుశాంత్‌ మృతి కేసు విషయంలో ఆయన తండ్రి కేకే సింగ్‌ బీహార్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.కేసును విచారించేందుకు ముంబయి వెళ్లిన పాట్నా ఐపీఎస్‌ అధికారికి అక్కడి పోలీసులు మరియు స్థానిక మున్సిపల్‌ అధికారులు హోం క్వారెంటైన్‌ ముద్ర వేసిన విషయం తెల్సిందే.

 Mumbai Police Cbi Sushanth Singh Case Quarantine

ఆయన రూల్‌ ప్రకారం రెండు వారాలు పూర్తిగా క్వారెంటైన్‌ ఉండి ఆ తర్వాత కేసుకు సంబంధించిన ఎంక్వౌరీ చేసుకోవచ్చు అంటూ ముంబయి పోలీసులు సూచించారు.ఈ విషయమై రెండు రాష్ట్రాల మద్య గొడవ జరిగింది.

ఒక ఐపీఎస్‌ అధికారికి క్వారెంటైన్‌ ముద్ర వేయడం ఏంటీ అంటూ ముంబయి పోలీసులపై బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇదంతా కూడా సుశాంత్‌ కేసులో కొందరికి సహకరించే ఉద్దేశ్యంతో ముంబయి పోలీసులు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

సుశాంత్‌ కేసు : సీబీఐ వారికి కూడా చుక్కలు చూపిస్తున్న ముంబయి పోలీసులు-Movie-Telugu Tollywood Photo Image

ఈ సమయంలో బీహార్‌ పోలీసులు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరడం సీఎం నితీష్‌ అందుకు సిఫార్సు చేయడం జరిగింది.సీబీఐ వారు ముంబయికి విచారణకు వెళ్లేందుకు సిద్దం అవ్వగా వారికి కూడా క్వారెంటైన్‌ తప్పదంటూ ముంబయి పోలీసులు సూచించారు.

ప్రస్తుతం ముంబయిలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బయట నుండి వచ్చే ప్రతి ఒక్కరు రెండు వారాల పాటు హోం క్వారెంటైన్‌ లేదా ప్రభుత్వ క్వారెంటైన్‌లో ఉండాలంటూ వారు చెబుతున్నారు.సీబీఐ వారు కేసు విచారణకు వచ్చినా కూడా వారికి క్వారెంటైన్‌ ముద్ర పడుతుందని ఈ సందర్బంగా ముంబయి నగర పాలక సంస్థ అధికారులు మరియు పోలీసులు తెలియజేశారు.ఈ విషయమై సీబీఐ ఎలా రియాక్ట్‌ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

#SushanthSingh #Death Mystery #BiharCM #CBiOfficials

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mumbai Police Cbi Sushanth Singh Case Quarantine Related Telugu News,Photos/Pics,Images..