దొంగతనం చేసిన సీరియల్ హీరోయిన్లు.. ఎందుకు చేశారంటే..?

సాధారణంగా సినిమా హీరోయిన్లకు, సీరియల్ హీరోయిన్లకు సంపాదన భారీగా ఉంటుందనే సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఇద్దరు సీరియల్ హీరోయిన్లు దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యారు.

 Mumbai Police Arrests 2 Crime Serial Actresses Theft Case-TeluguStop.com

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఒక క్రైమ్ షో చేయడం ద్వారా మంచి పేరును సొంతం చేసుకున్న సురభి సుందర్ లాల్, ముక్తర్ షేక్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.క్రైమ్ పెట్రోల్ అనే టీవీ షోతో పాటు సావ్ ధాన్ ఇండియాలో నటించి ఈ సీరియల్ యాక్టర్లు మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే ముక్తర్, సురభి రాయల్ పామ్ అనే ఏరియాలో ఫ్రెండ్ ఇంటికి పేయింగ్ గెస్ట్ గా వెళ్లగా అప్పటికే అక్కడ పేయింగ్ గెస్ట్ గా ఉన్న మరో మహిళ దాచుకున్న 3,28,000 రూపాయలు మాయమైంది. మే 18వ తేదీన డబ్బులు మాయం కావడంతో ఆ మహిళ సమీపంలో ఉన్న అరే పోలీస్ స్టేషన్ లోని పోలీసులను సంప్రదించి ఈ ఘటన గురించి ఫిర్యాదు చేసింది.

 Mumbai Police Arrests 2 Crime Serial Actresses Theft Case-దొంగతనం చేసిన సీరియల్ హీరోయిన్లు.. ఎందుకు చేశారంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు.

Telugu Crime Petrol, Muktar, Mumbai Police, Serial Actresses, Surabhi, Theft Case-Movie

ఆ ఫుటేజీలలో సీరియల్ యాక్టర్లు మహిళ ఇంట్లోకి చొరబడినట్లు గుర్తించిన పోలీసులు ఆ అపార్ట్ మెంట్ నుంచి పారిపోయిన యాక్టర్లను పట్టుకున్నారు.సీరియల్ యాక్టర్ల దగ్గర ఉన్న 50వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల విచారణలో సీరియల్ యాక్టర్లు లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోవడంతో దొంగతనం చేసినట్లు తెలిపారు.

తాము ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని సీరియల్ యాక్టర్లు వెల్లడించారు.

లాక్ డౌన్ నిబంధనలు సీరియల్ యాక్టర్లను దొంగలుగా మార్చడం గమనార్హం.

క్రైమ్ సీరియళ్ల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న యాక్టర్లు క్రైమ్ చేసి వార్తల్లో నిలిచారు.సీరియల్ యాక్టర్లు అరెస్ట్ కావడంతో ఆయా యాక్టర్ల అభిమానులు అవాక్కవుతున్నారు.

#Muktar #Surabhi #Mumbai Police #Crime Petrol #Theft Case

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు