సముద్రంలో కొట్టుకుపోతున్న మహిళ.. మెరుపువేగంతో కాపాడిన వ్యక్తి!

కొన్ని కొన్ని సార్లు మనం ఎలాంటి తప్పు చేయకపోయినా కూడా పరిస్థితులు చేయి దాటి పోతాయి.ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలో కూడా మనకు తోచదు.

 Photographer Saved Woman Who Falls Into Sea In Mumbai Near Gateway Of India, Sel-TeluguStop.com

ఇంకా కొన్ని సందర్భాల్లో మన స్వీయ తప్పిదం మూలానే మనం రిస్క్ లో పడతాం.ఎవరైనా వచ్చి మనల్ని కాపాడితే హమ్మయ్యా… మనకు ఈ భూమి మీద నూకలు మిగిలే ఉన్నాయి అని దేవుడికి మనసులో కృతజ్ఞతలు చెప్పుకుని హ్యాపీగా ఫీలవుతాం.

ఎవరూ కాపాడకపోతే ప్రాణాలు కోల్పోవడమే, తీవ్ర గాయాలపాలయి ఆస్ప్రతిలో చేరడమో జరుగుతుంది.అలా కాకుండా ముందుగానే ఇలా ప్రమాదం సంభవించే పనులు చేయకపోవడం ఉత్తమం అని మన పెద్దలు చెబుతారు.

ముంబైలోని సముద్రం వద్ద సేదతీరుతూ కూర్చున్న ఓ మహిళ సడెన్ గా నీళ్లలోకి పడిపోయింది.తర్వాత ఏం జరిగిందంటే….

ముంబై మహానగరంలోని గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.సెల్ఫీలు తీసుకుంటూ సముద్రపు గోడపై కూర్చున్న 55 ఏళ్ల పల్లవి ముండే అనే మహిళ ప్రమాదవశాత్తూ సముద్రంలో పడిపోయింది.

అయితే అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్ ఇది చూసి వెంటనే స్పందించాడు.ప్రాణాలకు తెగించి మరీ మహిళను సేవ్ చేశాడు.తనకు ఒక్కసారగి కళ్లు బైర్లు కమ్మి తాను నీటిలోకి పడిపోయానని పల్లవి వాపోయింది.

అక్కడే ఉన్న గులాబ్‌చంద్‌ గోండ్‌ అనే ఫొటో గ్రాఫర్ ఇది గమనించి కాపాడడంతో ఆమె బతికి బట్టగలిగింది.తాడు సహాయంతో గులాబ్ చంద్ గోండ్ పల్లవిని కాపాడాడు.దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో రచ్చ లేపుతోంది.

ఇది చూసిన పలువురు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.ఫొటో గ్రాఫర్ ను పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube