ఆ మ‌హాన‌గ‌రంలో మినీ లాక్‌డౌన్.. ఎప్ప‌టి నుంచి అంటే..

ముంబైలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది.నగరంలో ఏర్ప‌డుతున్న ప‌రిస్థితుల‌ దృష్ట్యా, మినీ లాక్‌డౌన్ విధించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి .

 Mumbai Mayor Hints At Mini Lockdown, Mini Lockdown, Mumabai , Corona ,omicron, C-TeluguStop.com

ఈ విషయాన్ని ముంబై మేయర్ కిషోరీ పెడ్నేకర్ తెలిపారు.ముంబైలో రోజుకు 20 వేల కేసులు వస్తే, లాక్‌డౌన్ విధింపుపై నిర్ణయం తీసుకుంటామని ముంబై మేయర్ కిషోరీ పెడ్నేకర్ తెలిపారు.

మీడియాకు అందిన స‌మాచారం ప్రకారం, ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించే ఆలోచన అయితే లేదని చెప్పారు.కానీ మినీ లాక్‌డౌన్ విధించవచ్చ‌న్నారు.

ముంబైవాసులు క‌రోనా విష‌యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, కొంతమంది పౌరులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నార‌ని ఆమె అన్నారు.ముంబై ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా క‌రోనా అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని పేర్కొన్నారు.క‌రోనా బాధితుల‌కు ముంబైలో తగిన‌న్నిపడకలు అందుబాటులో ఉన్నాయి.22 వేల‌ పడకల‌ను వైర‌స్ తీవ్రంగా ఉన్న‌వారి కోసం రిజర్వ్ చేశామ‌న్నారు.అయితే క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన వారిలో ఎలాంటి సీరియ‌స్‌ లక్షణాలు క‌నిపించ‌డం లేద‌న్నారు.

Telugu Casses, Corona, Lockdown, Mumabai, Omicron, Sharad Pawar-General-Telugu

ప్రస్తుతం 1,170 మంది బాధితులు ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతానికి పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఉండదని, అయితే కొంతమంది పౌరుల అజాగ్ర‌త్త కారణంగా రోగుల సంఖ్య పెరిగితే కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంటామ‌ని మేయర్ తెలిపారు.దీనిపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఆరోగ్య మంత్రి శరద్ పవార్ నిర్ణయం తీసుకోనున్నారు.క‌రోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నందున‌ మినీ-లాక్‌డౌన్ విధించనున్నారు.

కరోనా నిబంధనలను       ఖచ్చితంగా పాటించాలని ప్రజలకు మేయర్ విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube