టూ మచ్ బ్రో.. ఒక్క పాన్ ధర మరీ అంతనా..?!

మన దేశంలో చాలామంది పాన్ ప్రియులు ఉన్నారు.పాన్ అనేది భారత సంస్కృతిలో ఓక ముఖ్యమైన భాగం అనే చెప్పాలి.

 Mumbai Man Selling Special Pan For One Lakh Rupees Details,  పాన్ , Cost-TeluguStop.com

కొంతమంది ఈ పాన్ ను కిళ్లీ అని, తాబులం అని కూడా పిలుస్తూ ఉంటారు.కొంతమంది ఇప్పటికి భోజనం అయ్యాక తాంబూలం వేసుకుంటారు.

అది తింటే గాని వాళ్ళకి తిన్నది అరగదు అన్నమాట.అంతలా తాంబూలంకు అలవాటు పడిపోతారు.

చాలా మంది ఇప్పటికి పెళ్ళిళ్ళల్లో కిల్లీ ఇస్తూ ఉంటారు.షాపుల్లో కూడా మనకు ఎన్నో రకాలుగా దొరుకుతోంది.

తమలపాకు, సున్నం, వక్క కలిపిన దాన్ని తాంబూలం అంటాం.సుగంధ ద్రవ్యాలు కలిపితే దానిని పాన్ అని పిలుస్తారు.

పాన్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి.దేని టేస్ట్ దానిదే.

అలాగే పాన్ రుచిని బట్టి వాటి ధరలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి.

ఈ క్రమంలొనే మీకు ఒక స్పెషల్ పాన్ గురించి చెప్పాలి.

ఆ పాన్ గురించి చెప్పేముందు అసలు ఆ పాన్ యొక్క ధర ఎంతో తెలుసుకోవడం ముఖ్యం.సాధారణంగా మనం తినే పాన్ ఖరీదు పదుల్లో లేదంటే వందల రూపాయల్లో ఉంటుంది కదా.కానీ., ముంబైలోని ఓ షాపులో లభించే పాన్‌ ధర మాత్రం ఏకంగా ఒక లక్ష రూపాయలు అంట.ఏంటి ఒక్క పాన్ ధర లక్షా అని షాక్ అయ్యారా.?! అసలు వివరాల్లోకి వెళితే.

ముంబైలోని మాహిమ్​ ప్రాంతంలో నౌషాద్‌ షేక్ అనే వ్యక్తి ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయి ఉండి., ఎంఎన్‌సీలో చేసే ఉద్యోగాన్ని వదిలి మరి “ది పాన్‌ స్టోరీ” పేరుతో పాన్ షాపు నిర్వహిస్తున్నారు.షేక్ తయారుచేసే పాన్ కు ముంబైలో మంచి పేరుంది.ఈ క్రమంలో నౌషాద్ తనదైన స్టైల్ లో ఒక పాన్ తయారు చేసి దానికి ‘తాజ్‌మహల్‌ పాన్‌’ అని పేరు పెట్టారు.

తాజ్ మహల్ పాన్ ను ఎవరికైనా గిఫ్టుగా ఇస్తే అది వారి జీవితాంతం గుర్తుండిపోతుంది అంటున్నారు నౌషాద్.ప్రేమ పరిమళం పేరుతో ప్రత్యేక పాన్​ ను నౌషాద్ ఒక లక్ష రూపాయలకు అమ్ముతున్నారు.అలాగే అందులో పాన్ తో పాటు రెండు అత్తరు సీసాలను కూడా కానుకగా ఇచ్చేవాడు.నౌషాద్​ షాపులో రూ.35 నుంచి రూ.లక్ష విలువ చేసే పాన్​లు అందుబాటులో ఉంటాయి.తింటే గింటే నౌషాద్ తయారుచేసిన పాన్ తినాలని అంటారు ముంబై వాసులు.నౌషాద్ షేక్ తయారు చేసే ఈ పాన్ లకు బ్రిటన్, దుబాయ్ వంటి దేశాల పాన్ ప్రియులు ఆకర్షితులవుతున్నారు.

ఇంకో విశేషం ఏంటంటే.ఈ దుకాణంలో విక్రయించే పాన్ లో పొగాకు ఉండదని, ఇది పూర్తిగా పొగాకు రహితమని నౌషాద్ తెలిపారు.

Most Expensive Paan in Mumbai Expensive Paan 1Lakh Rupee Paan

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube