వర్షం దెబ్బకి ఒంటరైన పిల్లి పిల్ల... పెద్ద మనుసుతో పెంచుకుంటా అంటున్న ముంబై వాసి...!

ప్రస్తుతం ముంబై నగరంలో, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఓ వైపు కరోనా మహమ్మారితో అతలాకుతలమైన మహారాష్ట్ర, తాజాగా ఈ భారీ వర్షాలతో తడిసి ముద్దయింది.

 Mumbai Man Saves Cat In Rain, Mumbai Rains, Cat, Viral Video, Social Media-TeluguStop.com

రాష్ట్రంలోని ప్రజలు కంటి మీద కునుకు లేకుండా జీవనం కొనసాగిస్తున్నారు.గంటకు వంద మైళ్ల వేగంతో కంటే ఎక్కువగా బలమైన గాలులతో వర్షాలు కురుస్తున్నాయి.

దీంతో అనేక చోట్ల ఇంటి పై కప్పులతో పాటు అనేక పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలకు ఒరుగుతున్నాయి.ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక మంది ముంబై నగరంలోని పరిస్థితుల గురించి వీడియోలను షేర్ చేస్తున్నారు.

ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం ముంబై పరిస్థితి అలా ఉంది అని చెప్పవచ్చు.దీంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

అయితే ముంబై నగరంలోని పరిస్థితులను అనేకమంది సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉండగా… అందులో ఓ వీడియో వైరల్ గా మారింది.భారీ వర్షాలతో అనేకమంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు.

వీరితో పాటు అనేక మూగ జీవాలు కూడా ఒంటరి అయిపోయాయి.తాజాగా ముంబై నగరంలోని వాడాలా ప్రాంతంలో ఒంటరిగా అరుస్తున్న పిల్లి పిల్లని ఓ వ్యక్తి అటుగా వెలుతుండగా దానిని గమనించాడు.

ఆ పిల్లి వర్షం నీటిలో తడుస్తూ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సదరు వ్యక్తి దానిని రక్షించి బైక్ పై కూర్చోబెట్టుకొని తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు.ఇక ఆ పిల్లి పిల్లను తానే పెంచుకుంటాను అని అతడు తెలియజేశాడు.

ఇకపోతే ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube