దారినపోయేదాన్ని నెత్తిన పెట్టుకున్నారు...చివరికి నెటిజెన్లతో తిట్లకు గురయ్యారు విరుష్క.!       2018-06-19   00:26:57  IST  Raghu V

భారత సెలెబ్రిటీ జోడీ అనుష్కశర్మ- విరాట్ కొహ్లీ…ఓ చెత్త వివాదంలో చిక్కుకొన్నారు. లగ్జరీ కారులో ప్రయాణం చేస్తూ ముంబై రోడ్డుపై చెత్తవేసిన ఓ యువకుడిని అనుష్క మందలించడం దానిని వీడియో తీసి విరాట్ కొహ్లీ నెట్ లో పోస్ట్ చేయటం పట్ల మిశ్రమస్పందన వ్యక్తమయ్యింది. చివరకు అనుష్క పరిస్థితి తిట్టబోయి తిట్లుతిన్నట్లుగా తయారయ్యింది.

కొన్ని రోజుల క్రితం.. కోహ్లీ, అనుష్క శర్మ కారులో ప్రయాణిస్తున్న సమయంలో.. పక్కనే కారులో వెళ్తున్న అర్హాన్‌ సింగ్‌ అనే వ్యక్తి తన కారు నుంచి ఓ ప్లాస్టిక్‌ కవర్ ను రోడ్డుపై పడేశాడు. దీన్ని చూసిన అనుష్క కారును ఆపి అర్హాన్‌ సింగ్‌ తీరుపై మండిపడ్డారు. ప్లాస్టిక్ ను డస్ట్ బిన్ లో వేయకుండా రోడ్డుపై ఎందుకు వేస్తున్నావంటూ అతడిని నానా మాటలు అంది. ఈ సమయంలో పక్కనే ఉన్న కోహ్లీ ఈ ఘటనను వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. రోడ్డుపై ఎవరైనా చెత్త పడేయడం చూసినప్పుడు మీరు కూడా ఇలానే ప్రశ్నించండి.. అవగాహన కల్పించండి అంటూ ట్వీట్‌ చేశాడు. దీంతో ఫేస్ బుక్ ద్వారా తన తప్పుకి క్షమాపణలు తెలిపిన అర్హాన్‌ సింగ్‌.. తనపై అనుష్క, కోహ్లీ ప్రవర్తించిన తీరును తప్పుపట్టారు. నేను రోడ్డుపై పడేసిన చెత్త కంటే.. అనుష్క నోట్లో నుంచి వచ్చిన చెత్తే ఎక్కువగా ఉంది. ఒక సెలబ్రిటీ అయిన మీకు.. ఇది మర్యాద అనిపించుకోదని అర్హాన్ సింగ్ తెలిపాడు.

అర్హాన్ సింగ్ తల్లి సైతం…విరుష్క జోడీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శుభ్రత పేరుతో అనుష్క, విరాట్ జోడీ తమ గొప్పతనాన్ని ప్రచారం చేసుకోడాన్ని మించిన చెత్తపని మరొకటి లేదని…ఎదుటివారిని కించపరచేలా..వీడియోలు పెట్టే హక్కు ఎవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదిఏమైనా…విరుష్కజోడీ వీడియా…వైరల్ గా మారటం సంగతేమో కానీ…మిశ్రమస్పందన మాత్రం వ్యక్తమయ్యింది. అనుష్కశర్మ చెత్తవాగుడు విధానం నుంచి బయటకు వచ్చి..కాస్త మృదువుగా, మర్యాదగా మాట్లాడటం నేర్చుకొంటే బాగుంటుందని…సోషల్ మీడియా ద్వారా చాలామంది సలహా ఇవ్వటం ఇక్కడి కొసమెరుపు.

కోహ్లీ, అనుష్కల తీరుపై సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పార్టీల సమయంలో కేక్‌ మొత్తం ముఖానికి పూసుకుని దానిని వృథా చేస్తున్నారు. దేశంలో ఎంతో మంది చిన్నారులు తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. మీకు మాత్రం అది ఎంజాయ్ కదా, ఈసారి కేక్‌కు బదులు ఆవు పేడ పూసుకో అంటూ అనుష్కను తిట్టిపోస్తున్నారు. రోడ్డుపై వెళ్లే వారిని కాదు ముందు గ్రౌండ్ లో నోటికొచ్చినట్లు తిట్టే నీ భర్తను కంట్రోల్‌లో పెట్టు అంటూ అనుష్కపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

,